హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

COVID-19: లాక్‌డౌన్‌లో మీకు ఉపయోగపడే 5 యాప్స్ ఇవే...

COVID-19: లాక్‌డౌన్‌లో మీకు ఉపయోగపడే 5 యాప్స్ ఇవే...

COVID-19: లాక్‌డౌన్‌లో మీకు ఉపయోగపడే 5 యాప్స్ ఇవే...
(ప్రతీకాత్మక చిత్రం)

COVID-19: లాక్‌డౌన్‌లో మీకు ఉపయోగపడే 5 యాప్స్ ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)

Mobile Apps | లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారా? అయితే మీకు ఉపయోగపడే యాప్స్ గురించి తెలుసుకోండి.

దేశమంతా లాక్‌డౌన్‌లోనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆంక్షల్లో కాస్త సడలింపు ఉంది. ఎక్కువమంది ఇళ్లకే పరిమితం అయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు, విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్నారు. అందరికీ ఈ లాక్‌డౌన్ అనుభవాలు కొత్తే. ఈ లాక్‌డౌన్ సమయంలో బోర్ కొట్టడం ఖాయం. మరి లాక్‌డౌన్‌తో ఇళ్లకు పరిమితమైనవారికి ఉపయోగపడే యాప్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో 5 యాప్స్ గురించి తెలుసుకోండి.

1. Arogaya Setu: నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ రూపొందించిన యాప్ ఇది. కరోనా వైరస్ పేషెంట్లను ట్రాక్ చేయడం, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఆరోగ్య సేతు యాప్ ఉపయోగపడుతుంది. అంతేకాదు అందులో సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు కరోనా వైరస్ సోకే రిస్క్ ఎంతో తెలుస్తుంది. కరోనా వైరస్ సోకినవాళ్లు ఎవరైనా మీకు దగ్గర్లో ఉంటే అలర్ట్ చేస్తుంది. దీంతో పాటు కోవిడ్ 19 అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఇ-పాస్‌కు అప్లై చేయొచ్చు. ఈ యాప్ 11 భాషల్లో పనిచేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2. UMANG: కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ రూపొందించిన యాప్ ఇది. భారత పౌరులకు ప్రభుత్వ సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లో అందించే యాప్ ఇది. చాలావరకు ప్రభుత్వ సేవలు మీకు ఆన్‌లైన్‌లోనే లభిస్తాయి.

3. Simply Local: ఇది కమ్యూనిటీ యాప్. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వ అధికారులకు ఈ యాప్ ఉపయోపడుతుంది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. పరిస్థితిని బట్టి ప్రజలు అప్రమత్తమయ్యేలా హెచ్చరిస్తుంది.

4. IMumz: గర్భిణీలు లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడకుండా ఈ యాప్ ఉపయోపడుతుంది. గర్భిణీల సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు 100 మందికి పైగా ఆరోగ్య నిపుణులు అందుబాటులో ఉంటారు. లాక్‌డౌన్‌ సమయంలో గర్భిణీలు ఒత్తిడికి గురికాకుండా, సమయానికి డాక్టర్‌ను సంప్రదించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ సేవలన్నీ ఉచితం.

5. Simply Yoga: యోగా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే సింప్లీ యోగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 30 పైగా యోగాసనాలు నేర్చుకోవచ్చు. 20, 40, 60 నిమిషాల పాటు యోగా చేయొచ్చు. ఈ యాప్ ఉచితం.

ఇవి కూడా చదవండి:

Vodafone: రోజూ 2జీబీ డేటా ఫ్రీగా ఇస్తున్న వొడాఫోన్... ఎవరికంటే

PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఈ స్టెప్స్‌తో తెలుసుకోండి

Loan: రూపాయి వడ్డీకే లోన్ తీసుకోవచ్చు... ఆ స్కీమ్‌లో ఉన్నవారికే అవకాశం

First published:

Tags: Aarogya Setu, Android, Android 10, Lockdown, Mobile App, Playstore

ఉత్తమ కథలు