Reliance JioFiber: ఉచితంగా రిలయెన్స్ జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ 10ఎంబీపీఎస్ ప్లాన్

Reliance JioFiber: ఉచితంగా రిలయెన్స్ జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ 10ఎంబీపీఎస్ ప్లాన్ (ప్రతీకాత్మక చిత్రం)

Reliance JioFiber | వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి గుడ్ న్యూస్. జియో ఫైబర్ ఉచిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందిస్తోంది.

  • Share this:
    దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? రిలయెన్స్ జియోఫైబర్ గుడ్ న్యూస్ చెప్పింది. 10 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఉచితంగా ఇస్తామని రిలయెన్స్ జియోఫైబర్ ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రిలయెన్స్ జియోఫైబర్ ఈ ఆఫర్ అందిస్తోంది. వీలైన ప్రాంతాల్లో, ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా ఈ ప్లాన్ అందించనుంది రిలయెన్స్ జియోఫైబర్. #JioTogether క్యాంపైన్‌లో భాగంగా జియోఫైబర్ అందిస్తున్న అద్భుతమైన ఆఫర్ ఇది. జియోఫైబర్ ప్లాన్స్‌ బేసిక్ ప్లాన్ 10ఎంబీపీఎస్‌తో లభిస్తుంది. భారతదేశంలో లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు ఈ కొత్త ప్లాన్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఆ తర్వాత సబ్‌స్క్రైబర్లు ఉచిత ప్లాన్ నుంచి ప్రస్తుతం ఉన్న ఇతర ప్లాన్స్‌లోకి మారొచ్చు.


    మీరు ఉచితంగా జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ 10ఎంబీపీఎస్ ప్లాన్ పొందాలనుకుంటే జియో వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా జియో యూజర్లు ఇబ్బందులు పడకూడదని రిలయెన్స్ అనేక ఆఫర్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జియో సబ్‌స్క్రైబర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ని ప్రకటించింది. వాటి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Indian Railways: రైలు బోగీల్లో 3,20,000 ఐసోలేషన్ బెడ్స్... తెలంగాణకు 7,776 బెడ్స్

    JioPhone: జియోఫోన్ యూజర్లకు శుభవార్త... 10 రెట్లు లాభాలివే తెలుసుకోండి

    Coronavirus: స్మార్ట్‌ఫోన్‌పై కరోనావైరస్ ఎన్ని రోజులు ఉంటుందంటే
    Published by:Santhosh Kumar S
    First published: