థాయ్‌లాండ్ మాల్స్‌లో రోబో డాగ్స్... కరోనా రాకుండా శానిటైజర్ సేవలు.. వైరల్...

news18-telugu
Updated: June 6, 2020, 7:48 AM IST
థాయ్‌లాండ్ మాల్స్‌లో రోబో డాగ్స్... కరోనా రాకుండా శానిటైజర్ సేవలు.. వైరల్...
థాయ్‌లాండ్ మాల్స్‌లో రోబో డాగ్స్... కరోనా రాకుండా శానిటైజర్ సేవలు.. వైరల్... (credit - twitter)
  • Share this:
Corona Lockdown | Corona Update : టూరిస్టుల డెస్టినేషన్‌గా పిలుచుకునే థాయ్‌లాండ్... కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరైంది. ఇప్పుడు అక్కడ కేసులు దాదాపు తగ్గిపోయాయి. నిన్న ఒక్క కేసే నమోదైంది. యాక్టివ్ కేసులు 73 ఉన్నాయి. ఇప్పటివరకూ 58 మంది చనిపోయారు. అందుకే కరోనా మళ్లీ పెరగకుండా ఉంటేందుకు థాయ్ ప్రజలు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ముఖ్యంగా షాపింగ్ మాళ్లలో కస్టమర్లకు రోబోల ద్వారా వీలైనన్ని ఎక్కువ సేవలు అందిస్తున్నారు. తాజాగా K9 అనే రోబో డాగ్... తన వీపుపై... హ్యాండ్ శానిటైజర్ బాటిల్ పెట్టుకొని... మాల్ మొత్తం తిరుగుతోంది. కస్టమర్ల దగ్గరకు వెళ్లి... శానిటైజర్ రాసుకోమని చెబుతుంది. ఇలా మాల్‌లో ఎవరికీ కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఈ రోబో డాగ్‌ని చూసి కస్టమర్లు చాలా ఆనందపడుతున్నారు. మర్చిపోకుండా శానిటైజర్ రాసుకునే విధానాన్ని మాల్‌లో ఇలా కొత్తగా అలవాటు చేయడాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. ఈ రోబో కుక్క 5జీ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఎక్కువ. కాబట్టి... ఈ కుక్క ఎక్కడా బ్రేక్ లేకుండా పనిచేస్తోంది. ఐతే... ఈ కుక్క ఎముకల గూడులా ఉందనీ, అది అలా నడిచి వస్తోంటే భయం వేస్తోందని కొందరు అంటున్నారు.

బ్యాంకాక్‌లోని పాపులర్ సెంట్రల్ వరల్డ్ మాల్‌లో ఈ డాగ్ ఉంది. పిల్లలు దీనికి బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. కుక్క పైన ఉన్న బాటిల్ నుంచి శానిటైజర్ తీసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. సింగపూర్ కూడా ఇలాగే పార్కుల్లో కుక్కల్ని కాపలాగా పెట్టి... ప్రజలు డిస్టాన్స్ పాటించేలా చేస్తోంది. భారత్‌లో మిత్ర రోబో... కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తోంది. మొత్తంగా ఇలా ప్రపంచమంతా... ఇప్పుడు రోబోల వైపు చూస్తోంది. కరోనా చేసిన పనికి... ఇలాంటి మార్పులొస్తున్నాయి.
Published by: Krishna Kumar N
First published: June 6, 2020, 7:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading