Flipkart Sale | మీరు కొత్తగా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకోసం భారీ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీపై (Smart TV) కళ్లుచెదిరే డీల్ లభిస్తోంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీపై ఏకంగా 77 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. కొత్త టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో కూకా స్మార్ట్ టీవీ ఒకటి తక్కువ ధరకే లభిస్తోంది. 32 ఇంచుల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ కూలిటా టీవీ ఎంఆర్‌పీ రూ. 36,990గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మీరు కేవలం రూ. 8,499కే కొనుగోలు చేయొచ్చు. అంటే భారీ తగ్గింపు వస్తోందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు డీల్ కూడా ఉంది. దీని ద్వారా స్మార్ట్ టీవీ కొంటే రూ. 425 వరకు తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు మీకు ఈ టీవీ రూ. 8074కే లభిస్తోందని చెప్పుకోవచ్చు.
84 రోజులు రీచార్జ్ అక్కర్లేదు.. ఫ్రీకాల్స్, డైలీ 2.5 జీబీ డేటా.. డిస్నీ హాట్‌స్టార్, ప్రైమ్ ఫ్రీ
ఈ స్మార్ట్ టీవీలో డాల్బే ఆడియో, ఐకేర్ టెక్నాలజీ, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, డేటా సేవర్ మోడ్, ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్, డ్యూరబుల్ డిజైన్, గేమ్ మోడ్, డాల్బే ఆడియో, కూల్‌గో టీవీ అప్లికేషన్స్, సీసీ కాస్ట్, 20 వాట్ సౌండ్ ఔట్ పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ స్మార్ట్ టీవీలో ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్, జీ5 వంటి యాప్స్ అన్నింటినీ చూడొచ్చు.
రూ.12 వేల బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ రూ.1,999కే.. భారీ డిస్కౌంట్ ఆఫర్!
అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంది. నో కాస్ట్ ఈఎంఐ అయితే మూడు నెలల వరకు పెట్టుకోవచ్చు. నెలకు రూ. 2833 చెల్లించాల్సి ఉంటుంది. బజాజ్ ఈఎంఐ కార్డుపై కూడా ఈ డీల్ అందుబాటులో ఉంది. స్టాండర్డ్ ఈఎంఐ విషయానికి వస్తే.. ఆరు నెలల నుంచి 36 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. 36 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 299 చెలించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపైనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అదే 24 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 417 కట్టాలి. ఇంకా 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 531 పడుతుంది. అలాగే 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 768 చెల్లించాలి. 9 నెలల ఈఎంఐ ప్లాన్ అయితే నెలకు రూ.1000 కట్టాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart tv, Flipkart, Flipkart offers, Smart TV