'సెక్స్ టాయ్' వివాదం ముగిసింది... మళ్లీ అవార్డొచ్చింది

Sex Toy Award Controversy | ఆ సెక్స్ టాయ్ తయారు చేయడం అనైతికం, అశ్లీలం అన్న కారణంతో అవార్డును వెనక్కి తీసుకున్నారు నిర్వాహకులు. అసలు ఆ షోలో సెక్స్ టాయ్ ప్రదర్శించకుండా బ్యాన్ చేశారు.

news18-telugu
Updated: May 9, 2019, 5:37 PM IST
'సెక్స్ టాయ్' వివాదం ముగిసింది... మళ్లీ అవార్డొచ్చింది
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది ఓ సెక్స్ టాయ్. ఈ ఏడాది ప్రారంభంలో ఆ సెక్స్ టాయ్ వివాదాస్పదమైంది. పెను దుమారాన్ని రేపింది. 2019 ఇంటర్నేషనల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో రచ్చకు కారణమైంది. వాస్తవానికి ఆ సెక్స్ టాయ్‌ని గొప్ప ఆవిష్కరణగా మొదట గుర్తించారు నిర్వాహకులు. అంతే కాదు... మహిళల కోసం సెక్స్ టాయ్‌ 'ఓజ్' రూపొందించిన లోరా డికార్లో స్టార్టప్ నిర్వాహకులకు అవార్డు కూడా ఇచ్చారు. రోబోటిక్స్ అండ్ డ్రోన్ కేటగిరీలో CES 2019 ఇన్నోవేషన్ హానరీ అవార్డుకు సెక్స్ టాయ్‌ 'ఓజ్'ను ఎంపిక చేశారు జడ్జీలు. ఆ అవార్డు ముచ్చట కొన్ని గంటలే. ఇంతలో అవార్డు వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. సెక్స్ టాయ్‌కి ఇన్నోవేషన్ అవార్డును ఇవ్వడంపై అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆ సెక్స్ టాయ్ తయారు చేయడం అనైతికం, అశ్లీలం అన్న కారణంతో అవార్డును వెనక్కి తీసుకున్నారు నిర్వాహకులు. అసలు ఆ షోలో సెక్స్ టాయ్ ప్రదర్శించకుండా బ్యాన్ చేశారు.

Read this: WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే

సెక్స్ టాయ్‌ 'ఓజ్'కు అవార్డు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్న వ్యవహారం అంతటితో ముగియలేదు. లోరా డికార్లో స్టార్టప్ సీఈఓ లోరా హాడాక్ ఏకంగా పోరాటాన్నే ప్రారంభించారు. నిర్వాహకులు లింగపక్షపాతం చూపిస్తున్నారని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని అప్పుడే గళం విప్పారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో నిర్వహించిన కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆమెతో పాటు మరికొందరూ గళం విప్పారు. CTA తీరును ప్రశ్నించారు. చివరకు లోరా హాడాక్ పోరాటం ఫలించింది. నాలుగు నెలల తర్వాత కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్‌ దిగొచ్చింది. సెక్స్ టాయ్‌ 'ఓజ్'కు అవార్డును మళ్లీ ప్రకటించింది.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...IRCTC: రూ.33 కోసం 24 నెలల పోరాటం... ఓ కామన్ మ్యాన్ కథ ఇది

Android Q: ఆండ్రాయిడ్ క్యూ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి... సపోర్ట్ చేసే ఫోన్స్ ఇవే
First published: May 9, 2019, 5:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading