Home /News /technology /

CONNECTED INFOTAINMENT SYSTEM MORE OF A DISTRACTION THAN SUPPORT WHILE DRIVING SURVEY SK GH

Infotainment System: కార్లలో ఇన్ఫో‌టైన్‌మెంట్ సిస్టమ్‌తో నష్టమే ఎక్కువా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోడ్ సేఫ్టీ ఛారిటీ బ్రేక్ నివేదిక ప్రకారం 49% మంది డ్రైవర్లకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిస్ట్రాక్షన్ తెప్పిస్తుందని తేలింది. అంతేకాక తమ వాహనాన్ని నడుపుతున్నప్పుడు దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని 63% మంది అంగీకరించారు.

    ఇన్ఫోటైన్మెంట్ మార్కెట్ రోజురోజుకీ గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది. కార్లలో వాడే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ద్వారా డ్రైవ్ చేస్తూనే సంగీతం, ఇంటర్నెట్, బ్లూటూత్, సాట్-నావ్ వంటి మరోన్నో సేవలను పొందొచ్చు. 2019లో16 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ ఇండస్ట్రీ వాల్యూ 2026 నాటికి 22 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని గ్లోబల్ ఇన్-వెహికల్ ఇన్ఫోటైన్మెంట్ నివేదిక ప్రకారం పేర్కొంది. కాగా ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) సాట్ నావ్స్ నుండి వాయిస్ కంట్రోల్ వరకు ఈ మార్కెట్ వేగంగా పెరుగుతోందని నివేదికలో తేలింది.

    ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ద్వారా మీరు మీ కారు నుండి డ్రైవ్- చేస్తూ మ్యూజిక్ను ఆనందించవచ్చు. వెనుక సీటులో కూర్చున్న ప్రయాణీకులు వర్చువల్ రియాలిటీ (VR) ద్వారా గేమ్స్ను కూడా ఆడొచ్చు. అయితే, ఈ కొత్త టెక్నాలజీని యూకేకి చెందిన డ్రైవర్లు ఎంతవరకు ఉపయోగిస్తారు? ఇన్ఫోటైన్మెంట్ గురించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి తాజాగా 1,000 మంది బ్రిట్స్పై ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో ప్రతి పది మంది యూకే డ్రైవర్లలో 6 మంది ఈ ఇన్ఫోటైన్‌మెంట్‌ను విశ్వసించడం లేదని తేలింది. అంతేకాక ప్రతి ముగ్గురిలో ఒకరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తమకు విఫలమైందని అంగీకరించారు.

    బిల్ట్ ఇన్ వాయిస్ రికగ్నిషన్, ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, టచ్స్క్రీన్స్, బిల్డ్ ఇన్ నావిగేషన్ సిస్టమ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇన్ఫోటైన్మెంట్ వంటి ఫీచర్లు డ్రైవర్లలో డిస్ట్రాక్షన్ పెరగడానికి కారమవుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. కార్లలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వల్ల- చాలామంది డ్రైవర్లు డిస్ట్రాక్షన్‌ (ఏకాగ్రతను దెబ్బతినడం)కు లోనవుతున్నారు. రోడ్ సేఫ్టీ ఛారిటీ బ్రేక్ నివేదిక ప్రకారం 49% మంది డ్రైవర్లకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిస్ట్రాక్షన్ తెప్పిస్తుందని తేలింది. అంతేకాక తమ వాహనాన్ని నడుపుతున్నప్పుడు దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని 63% మంది అంగీకరించారు.

    ఈ సిస్టమ్ మూలాన గతంలో కంటే ఎక్కువ డిస్ట్రాక్షన్‌కు గురవుతున్నామని 77% మంది డ్రైవర్లు అంగీకరించారు. అంటే డ్రైవింగ్‌ నుంచి తమ దృష్టి మరలుతోందని వెల్లడించారు. సాధారణంగా షాపింగ్ మరియు వినోదం కంటే మెరుగైన డ్రైవింగ్ పద్దతులను మాత్రమే యూకే డ్రైవర్లు ఇష్టపడతారు. తమ డాష్‌బోర్డులోని ట్రాఫిక్ హెచ్చరికలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయని 37% మంది పేర్కొన్నారు. హ్యాండ్స్-ఫ్రీ గేమ్స్ డ్రైవింగ్‌కు ఉన్నప్పుడు తమను డిస్ట్రాక్షన్‌కు గురిచేస్తాయిని యూకే డ్రైవర్లు భావిస్తారు.

    వాయిస్-కంట్రోల్డ్ డాష్‌బోర్డులపై అనాసక్తి
    ఇన్ఫోటైన్మెంట్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతున్న క్రమంలోనే కారులోని డాష్బోర్డులో కూడా అనేక మార్పులొచ్చాయి. ప్రస్తుతం అనేక కంపెనీలు వాయిస్ కంట్రోల్ సిస్టమ్స్ అందుబాటులోకి తెచ్చాయి. మెర్సిడెస్ బెంజ్ యూజర్ల ఎక్స్పీరియన్స్ కోసం ‘హే మెర్సిడెస్’ మరియు అమెజాన్ యొక్క ఎకో ఆటో వంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే వాయిస్- కంట్రోల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్పై యూకే డ్రైవర్లు అంతగా ఆసక్తి కనబరచడం లేదని తేలింది. కేవలం16% మంది మాత్రమే హ్యాండ్స్ ఫ్రీ, వాయిస్-కంట్రోల్డ్ డాష్‌బోర్డులను ఇష్టపడుతున్నారని సర్వే తేల్చిచెప్పింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Driving licence, Road Safety

    తదుపరి వార్తలు