హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

CAIT Protest: విదేశీ ఇ-కామర్స్ కంపెనీలకు వ్యతిరేకంగా సీఏఐటీ దేశవ్యాప్తంగా నిరసనలు

CAIT Protest: విదేశీ ఇ-కామర్స్ కంపెనీలకు వ్యతిరేకంగా సీఏఐటీ దేశవ్యాప్తంగా నిరసనలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

CAIT Protest | భారతదేశంలో విదేశీ ఇ-కామర్స్ (e-commerce) కంపెనీలు నిర్వహిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది.

విదేశీ నిధులతో పనిచేసే ఇ-కామర్స్ (e-commerce) కంపెనీలు దేశంలోని చిన్న వ్యాపారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆరోపిస్తోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ట్రేడ్ యూనియన్. ఈ కంపెనీలు దేశంలో ఇ-కామర్స్ (e-commerce) నియమాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయని సీఏఐటీ చెబుతోంది. చట్టానికి విరుద్ధంగా భారతదేశ ఇ-కామర్స్ (e-commerce) వ్యాపారంలో ఆధిపత్యం, గుత్తాధిపత్యం కోసం ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నాయని యూనియన్ నాయకులు చెబుతున్నారు. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ట్రేడర్స్ కాన్ఫరెన్స్‌లో సంస్థ పలు డిమాండ్లు చేసింది. వినియోగదారుల చట్టం కింద ప్రభుత్వం ప్రతిపాదించిన నిబంధనలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని CAIT డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15 నుంచి ఇ-కామర్స్‌పై హల్లా బోల్ అనే జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దేశంలోని 27 రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా ట్రేడ్ లీడర్స్ ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఇ-కామర్స్ వ్యాపారాలపై తమ వైఖరిని స్పష్టం చేయాలని CAIT దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాస్తుందని తెలిపారు యూనియన్ సెక్రటరీ జనరల్ బీసీ భారతీయా, జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ ఖండేల్వాల్. దేశంలోని వ్యాపారులు అన్ని పార్టీల స్పందన కోసం వేచి చూస్తారని.. ఆ తరువాత రాష్ట్రాల శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో సంబంధిత పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుపై దృష్టి సారించినప్పుడు, వ్యాపారులు కూడా తమను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి వెనుకాడరని వారు తేల్చి చెప్పారు.

LIC PAN Link: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అలర్ట్... వెంటనే మీ పాన్ నెంబర్ లింక్ చేయండి

విదేశీ నిధులతో నడిచే ఈ-కామర్స్ కంపెనీలు చిన్న వ్యాపారాలను అంతం చేయడం గురించి పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారా లేదా అని రాజకీయ కోణం నుంచి తెలుసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. విదేశీ ఈ-కామర్స్ కంపెనీలు కొత్తరకం ఈస్ట్ ఇండియా కంపెనీలుగా మారుతున్నాయని భారతీయా, ఖండేల్వాల్ ఆరోపించారు. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థ, రిటైల్ మార్కెట్, ఈ-కామర్స్ వ్యాపారం, వ్యవసాయం, ఇతర రంగాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు.

భారతదేశ వ్యాపారం భారతదేశంలో.. అదికూడా భారతీయుల చేతిలోనే ఉండాలని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. వ్యాపార ప్రయోజనాలు దేశంలోని వినియోగదారులకు, వ్యాపారులకు, పరిశ్రమలకు మాత్రమే చెందాలని తెలిపారు. భారతదేశ వాణిజ్యాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రణాళికలు వేస్తున్న సంస్థలతో పోరాడేందుకు దేశంలోని అన్ని విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. అప్పుడు మాత్రమే దేశంలోని ఇ-కామర్స్, రిటైల్ వాణిజ్యాన్ని విదేశీ కంపెనీల బారి నుండి కాపాడవచ్చని ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు పేర్కొన్నారు.

IRCTC: ఐఆర్‌సీటీసీతో కలిసి బిజినెస్ చేయండి... రూ.80,000 వరకు లాభం పొందండి

ప్రభుత్వం రూపొందించిన ఈ-కామర్స్ నియమాలను దేశీయ, విదేశీ ఈ-కామర్స్ కంపెనీలకు సమానంగా వర్తింపజేయాలని ట్రేడ్ యూనియన్ నాయకులు సమావేశంలో డిమాండ్ చేశారు. తద్వారా ఏ కంపెనీ కూడా ఈ-కామర్స్ వ్యాపారాన్ని తాకట్టు పెట్టదని చెప్పారు. ప్రతిపాదిత ఈ-కామర్స్ నియమాలను తక్షణమే అమలు చేయాలని, ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని కేంద్ర వాణిజ్య, వినియోగదారుల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను CAIT కోరింది. దేశంలోని 8 కోట్ల మంది వ్యాపారులు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని సంస్థ పేర్కొంది.

సెప్టెంబర్ 15న దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ట్రేడ్ యూనియన్లు.. వివిధ రాష్ట్రాల్లోని వెయ్యికి పైగా ప్రదేశాల్లో ధర్నా నిర్వహిస్తారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ 23న ప్రధాన మంత్రి పేరుతో ప్రతి జిల్లా కలెక్టర్‌కు ఒక మెమోరాండం అందజేస్తామని వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాలు నెల రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం వ్యాపారులు దేశంలోని మార్కెట్లలో ర్యాలీ నిర్వహిస్తూ, విదేశీ ఈ-కామర్స్ కంపెనీలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయనున్నారు.

First published:

Tags: Amazon, AMAZON INDIA, E-commerce, Flipkart

ఉత్తమ కథలు