Home /News /technology /

COMPARISION BETWEEN SAMSUNG GALAXY F13 AND SAMSUNG GALAXY F12 UMG GH

Samsung Phones: శామ్‌సంగ్ గెలాక్సీ F12 వర్సెస్ గెలాక్సీ F13.. రెండు బడ్జెట్ ఫోన్లలో ఏది బెస్ట్ అంటే..?

ఈ రెండు ఫోన్లలో ఏది బెస్టో తెలుసుకోండి.

ఈ రెండు ఫోన్లలో ఏది బెస్టో తెలుసుకోండి.

శామ్‌సంగ్ (Samsung) గత ఏడాది ఏప్రిల్‌లో గెలాక్సీ (Galaxy) F12 ఫోన్‌ (Phone)ను లాంచ్ చేసింది. దీనికి సక్సెసర్‌గా గెలాక్సీ F13ను తీసుకువచ్చింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ. 20,000 లోపే ఉంది.

ఇండియాలో టాప్ మొబైల్ బ్రాండ్‌ అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు శామ్‌సంగ్. ఈ కంపెనీ క్రమం తప్పకుండా వివిధ సెగ్మెంట్లలో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తుంది. అయితే ఇండియాలో బడ్జెట్ ఫోన్లకు డిమాండ్ ఉండటంతో, తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకు స్పెషల్‌గా F సిరీస్‌ నుంచి డివైజ్‌లను లాంచ్ చేస్తోంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియాలో మంచి ఆదరణ లభించింది. ఈ సిరీస్ నుంచి కొత్తగా గెలాక్సీ F13 ఫోన్‌ను కంపెనీ త్వరలో లాంచ్ చేయనుంది. శామ్‌సంగ్ సొంత Exynos SoCతో ఈ డివైజ్‌ను రూపొందించింది. గెలాక్సీ F-సిరీస్ నుంచి వచ్చిన ఈ తాజా ఎడిషన్‌, మెరుగైన సామర్థ్యం ఉన్న బ్యాటరీతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. శామ్‌సంగ్ గత ఏడాది ఏప్రిల్‌లో గెలాక్సీ F12 ఫోన్‌ను లాంచ్ చేసింది. దీనికి సక్సెసర్‌గా గెలాక్సీ F13ను తీసుకువచ్చింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ. 20,000 లోపే ఉంది.



శామ్‌సంగ్ గెలాక్సీ F13 ఎడిషన్ ఈ నెల చివర్లో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. శామ్‌సంగ్ వెబ్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ చానెళ్ల ద్వారా ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. హ్యాండ్‌సెట్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. ఇది 4GB+64 GB వేరియంట్ ధర రూ.11,999 కాగా, 4GB+128GB వేరియంట్‌ రూ.12,999కి అందుబాటులో ఉంటుంది. దీనికి ముందున్న గెలాక్సీ F12 కూడా ఇవే RAM, స్టోరేజ్ ఆప్షన్‌లలో లాంచ్ అయింది. ఈ రెండు ఫోన్లు ఒకే రకమైన ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. డిజైన్, ఇతర స్పెక్స్ పరంగా రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

శామ్‌సంగ్ గెలాక్సీ F12, గెలాక్సీ F13 ఫోన్ల స్పెసిఫికేషన్లు

డిస్‌ప్లే
గెలాక్సీ F12- 16.55 cm (6.51- అంగుళాల) HD+ డిస్‌ప్లే
గెలాక్సీ F13- 16.62cm (6.6-అంగుళాల) FHD+ LCD డిస్‌ప్లే

ప్రాసెసర్
గెలాక్సీ F12- Exynos 850 ప్రాసెసర్
గెలాక్సీ F13- Exynos 850 ప్రాసెసర్

ఆపరేటింగ్ సిస్టమ్
గెలాక్సీ F12- ఆండ్రాయిడ్ 11
గెలాక్సీ F13- ఆండ్రాయిడ్ 12

RAM
గెలాక్సీ F12- 4GB
గెలాక్సీ F13- 4GB

స్టోరేజ్
గెలాక్సీ F12- 64GB/128GB
గెలాక్సీ F13- 64GB/128GB

బ్యాటరీ
గెలాక్సీ F12- 6000 mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్
గెలాక్సీ F13- 6000 mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్

ధర
గెలాక్సీ F12- రూ. 10,999 నుంచి ప్రారంభం
గెలాక్సీ F13- రూ. 11,999 నుంచి ప్రారంభం.
Published by:Mahesh
First published:

Tags: Samsung, Samsung Galaxy, Smart phones, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు