కోకాకోలా (Coca-Cola) అంటే కూల్‌డ్రింక్స్, బెవరేజెస్ గుర్తొస్తాయి. కూల్‌డ్రింక్స్‌తో అందరికీ బాగా తెలిసిన ఈ కంపెనీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల రంగంలోకి అడుగుపెడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలోనే సంస్థ నుంచి ఫస్ట్ ఫోన్ రావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఆ వార్తలో నిజమెంత, ఆ స్మార్ట్ ఫోన్ ఎలా ఉండబోతోందో మీరు కూడా చదివి తెలుసుకోండి.
కూల్‌డ్రింక్స్‌తో స్మార్ట్‌గా బిజినెస్ చేసే కోకాకోలా త్వరలో ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనుంది. టెక్ అంశాలకు సంబంధించి టిప్స్ ఇచ్చే ముకుల్ శర్మ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేశారు. ‘ఇదిగోండి.. సరికొత్త కోలా ఫోన్ వస్తోంది’ అని మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చి నాటికి ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశముందని ఆయన చెబుతున్నారు. అయితే, ఈ ప్రొడక్ట్‌ను తయారు చేసేందుకు స్మార్ట్‌ఫోన్ మేకర్స్‌తో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ముకుల్ శర్మ అభిప్రాయపడ్డారు.
* లోగో అదేనా?
ఒకవేళ కోకా-కోలా స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తే ఎలా ఉంటుందో తెలియజేసేలా ఒక ఫొటోను కూడా ముకుల్ శర్మ్ పోస్ట్ చేశారు. సెల్‌ఫోన్ వెనుక కోకా-కోలా బ్రాండ్ కలర్, పేరు కనిపిస్తోంది. కోకా-కోలా అనే అక్షరాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఫోన్ వెనుక భాగంలో ట్విన్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ కుడి వైపున వాల్యూమ్ కంట్రోల్ బటన్ కూడా ఉంది. మిగిలిన స్పెషిఫికేషన్లు ఏవీ లీక్ కాలేదు. కనీసం ఎన్ని వేరియంట్లలో లభిస్తుందనే వివరాలు కూడా బయటకు రాలేదు.
[Exclusive] Here's the all new #Cola Phone ???? Can confirm that the device is launching this quarter in India. Coca-Cola is collaborating with a smartphone brand for this new phone. Feel free to retweet.#ColaPhone pic.twitter.com/QraA1EHb6w
— Mukul Sharma (@stufflistings) January 24, 2023
* మార్కెటింగ్ వ్యూహమా?
ముకుల్ శర్మ పోస్టుపై స్పందించిన నెటిజన్లు ఇదంతా మార్కెటింగ్ వ్యూహం కూడా అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మార్చి నాటికి ఫోన్ తీసుకురావటమే నిజమైతే, ఇప్పటికే వరకే ఫోన్ తయారీ ప్రారంభమవ్వాలి కదా అని ప్రశ్నించారు. ఒకవేళ ఇప్పటికే తయారీ ప్రారంభమైతే, ఇంత వరకూ ఎందుకు ప్రచారం ప్రారంభించలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ భాగస్వామ్య తయారీ పద్ధతిలో ఫోన్లు తయారు చేస్తుంటే, ఏ సంస్థతో ఒప్పందం చేసుకున్నారో అన్న విషయం తెలిసేది కదా అని సందేహాలు వ్యక్తం చేశారు. కోకా-కోలా ప్రొడక్ట్స్ వాణిజ్యంలో భాగంగా బ్రాండ్‌ను వార్తల్లో నిలిపేందుకు కూడా ఈ ప్రచారం జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
* క్వాలిటీ ఉంటే చాలు
అయితే, ఒక బెవరేజెస్ సంస్థ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడం కాస్త వింతగా ఉందని స్మార్ట్‌ఫోన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలోకి నాన్-స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిదారుడు ప్రవేశించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇది వరకే మార్కెట్‌లో మంచి పేరు సంపాదించిన సంస్థలతో ఒప్పందాలు చేసుకుని తమ బ్రాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లిన సంస్థలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, కంపెనీ ఏదైనప్పటికీ నాణ్యత బాగుంటే ప్రజలు ఆదరిస్తారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Smartphone, Smartphones, Tech news