ఇదిగో ఎగిరేపళ్లెం... ఏలియన్స్ ఉన్నారంటున్న యూఫాలజిస్టులు...

గ్రహాంతర వాసులు అంతరిక్షంతోపాటూ... మన భూమిపైనా ఉన్నారన్నది యూఫాలజిస్టుల వాదన. తాజాగా ఓ ఆధారాన్ని వారు తెరపైకి తెచ్చారు.

news18-telugu
Updated: January 10, 2020, 12:49 PM IST
ఇదిగో ఎగిరేపళ్లెం... ఏలియన్స్ ఉన్నారంటున్న యూఫాలజిస్టులు...
నాసా ఆర్కైవ్ ఫొటో (credit - https://eol.jsc.nasa.gov/SearchPhotos/photo.pl?mission=STS61B&roll=33&frame=12)
  • Share this:
పై ఫొటోలో ఉన్నది ఎగిరేపళ్లెంలాంటి ఆకారం. అది ఎగిరే పళ్లెమా లేక... అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసాకు చెందిన ఏదైనా ఆర్బిటరా అన్నది సస్పెన్స్ అయ్యింది. ఐతే... ఏలియన్స్‌పై పరిశోధనలు చేసే ప్రైవేట్ వెబ్‌సైట్ యూఎఫ్ఓ సైటింగ్స్ డైలీ... తాజాగా అది ఎగిరే పళ్లెమే అని అంటోంది. భూమి చుట్టూ తిరుగుతున్న షటిల్ అట్లాంటిస్ కింద ఈ ఎగిరే పళ్లెం ఉందని ఆ వెబ్‌సైట్ నిర్వాహకుడు స్కాట్ వారింగ్ చెబుతున్నారు. దీన్ని నాసా... ఓ శాటిలైట్ అని చెబుతోందనీ... కానీ... దీనితోపాటూ... ఇలాంటి ఫొటోల్లో తాను మరిన్ని ఎగిరే పళ్లేలను కనిపెట్టానని స్కాట్ అంటున్నారు. ఈ ఎగిరే పళ్లేన్ని నాసా తప్పుగా శాటిలైట్ అని చెబుతోందనీ... షటిల్ అట్లాంటిస్ చుట్టూ చాలా UFOలు తిరిగిన విషయం యూఫాలజిస్టులు అందిరికీ తెలుసని ఆయన చెబుతున్నారు. ఈ ఎగిరే పళ్లాల వల్లే... అట్లాంటిస్ షటిల్ ల్యాండిగ్ ఆలస్యమైందనీ... అన్ని UFOలూ వెళ్లిన తర్వాతే... షటిల్‌ను ల్యాండ్ చేశారనీ ఆయన తన వాదనను బలపరుస్తూ చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వేల కొద్దీ UFOలను గుర్తించారు స్కాట్. ఐతే... వేటికీ నాసా అవునని చెప్పలేదు. తాజాగా మరొకటి ఆ లిస్టులో చేరినట్లైంది.

నాసా ఆర్కైవ్ ఫొటో (credit - https://eol.jsc.nasa.gov/SearchPhotos/photo.pl?mission=STS61B&roll=33&frame=12)
Published by: Krishna Kumar N
First published: January 10, 2020, 12:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading