CIVIC ENGAGEMENT INTERNET SPEED RELATION FULL DETAILS HERE GH VB
Internet Speed: హై స్పీడ్ ఇంటర్నెట్ వాడేవారు ఆ పనులకు దూరంగా ఉంటారట.. ఏంటా పనులు.. తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
మనిషి సంఘ జీవి అనే విషయం అందరికీ తెలిసిందే. స్నేహితులతో కలిసి సరదాగా ఉండటంతో పాటు స్వచ్ఛంద సంస్ధల సేవలు, రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం (Political Activism), కమ్యూనిటీ(Community) పార్టీలకు హాజరుకావడం.. ఇలా అనేక వ్యాపకాల్లో నిమగ్నమై ఉంటాడు.
మనిషి సంఘ జీవి అనే విషయం అందరికీ తెలిసిందే. స్నేహితులతో కలిసి సరదాగా ఉండటంతో పాటు స్వచ్ఛంద సంస్ధల సేవలు, రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం (Political Activism), కమ్యూనిటీ(Community) పార్టీలకు హాజరుకావడం.. ఇలా అనేక వ్యాపకాల్లో నిమగ్నమై ఉంటాడు. అయితే ఇలా మనిషి సంఘజీవిగా ఉండటం అనేది ఇంటర్నెట్ వేగం(Internet Speed)పై ఆధారపడి ఉంటుందంటోంది ఒక పరిశోధన. హై స్పీడ్ ఇంటర్నెట్ వాడేవారు సంఘజీవి లక్షణాలకు దూరమవుతున్నట్లు అధ్యయనం తేల్చింది. కార్డివ్ వర్సిటీ, రోమ్ సాపియంజా యూనివర్సిటీ పరిశోధకులు(Researchers) ఈ విషయాన్ని తేల్చారు. ఎవరికైనా ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉందంటే వారు స్వచ్ఛంద సేవలు, కమ్యూనిటీ పార్టీలు, రాజకీయ కార్యక్రమాల్లో తక్కువగా పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.
స్వచ్ఛంద సేవలు, రాజకీయ కార్యకలాపాలు లాంటి పౌరభాగస్వామ్యాల్లో పాల్గొనేవారికి నెట్వర్కింగ్ స్పీడ్ తక్కువగా ఉన్నట్లు గమనించామని ఈ అధ్యయన రచయిత ఫాబియో సబాటిని తెలిపారు. ఈ సర్వేను జర్నల్ ఆఫ్ పబ్లిక్ ఎకనామిక్స్‌లో ప్రచురించారు. ఉదాహరణకు ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్ యాక్సెస్ ఉన్నవారు రాజకీయాల్లో పాల్గొనే రేటు 19% తగ్గింది. వేగవంతమైన ఇంటర్నెట్‌ని ఆస్వాదిస్తున్న వ్యక్తులు సామాజిక, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనే రేటు 10% తగ్గిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ అధ్యయనం కోసం వారు కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ ఆఫ్ కామ్, ఎక్స్ఛేంజ్ సెంటర్ల నుంచి ఇంటర్నెట్ స్పీడ్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.
అంతేకాకుండా బ్రిటీష్ హౌస్ హోల్డ్ ప్యానెల్ సర్వే, పౌర భాగస్వామ్యంపై యూకే హౌస్ హోల్డ్ లాంగిట్యూడనల్ స్టడీలో ఇచ్చిన ప్రజల సమాధానాల డేటాను క్రాస్ రిఫరెన్స్ చేశారు. 2010 నుంచి 2017 మధ్య కాలంలో వ్యక్తుల స్థానమార్పిడికి ప్రతి 1.8 కిలోమీటర్ల పరిధిలో సామాజిక భాగస్వామ్యంలో 6 శాతం తగ్గుదల కనిపించినట్లు గుర్తించారు. ఇందులో రాజకీయ పార్టీల ప్రమేయం ఎక్కువగా ఉండి చాలా ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. ట్రేడ్ యూనియన్లలో ప్రమేయం 3.6 శాతం మాత్రమే తగ్గిందని, సామాజిక లేదా పర్యావరణ సేవలను అందించే స్వచ్ఛంద సంస్థల ప్రమేయం 7.8 శాతం తగ్గిందని సర్వే తెలిపింది.
బ్రిటన్ ప్రజల పౌరభాగస్వామ్యం లేకపోవడానికి, రాజకీయాలకు జనాదరణ పెరగడానికి నేరుగా ముడిపడి ఉంటుందని సబాటిని తన అధ్యయనంలో తెలిపారు. జనాకర్షణ పెరుగుదల ప్రజావ్యవహారాలపై ఆసక్తి తగ్గుదలతో ముడిపడి ఉందని ఆమె అన్నారు. ఒకరి ఇంటర్నెట్ యాక్సెస్ వేగం వల్ల కుటుంబం, స్నేహితులతో వ్యక్తిగత సంబంధం గణనీయంగా ప్రభావితం కాలేదని అధ్యయనంలో కనుగొన్నామని, ఈ పరిశోధన సాంకేతిక మార్పులకు స్థితిస్థాపకంగా కనిపిస్తుందని తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.