MyGate app: ఎవరైనా అపార్ట్ మెట్ లోకి రావాలంటే ఈ యాప్ ఉండాల్సిదే.. కరోనా కట్టడికి ప్రత్యేక యాప్ ఉపయోగిస్తున్న నగరవాసులు..

ప్రతీకాత్మక చిత్రం

MyGate app: సెకండ్‌ వేవ్‌లో చాలా అపార్ట్‌మెంట్లు, రెసిడెన్షియల్‌ కమ్యూనిటీలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ వాసులు కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇక్కడి అసోసియేషన్లు గ్రూపులుగా ఏర్పడటంతోపాటు సరికొత్త ‘మై గేట్’యాప్‌ ను వినియోగిస్తూ కరోనా వైరస్‌ను కట్టడి చేస్తున్నారు.

 • Share this:
  కరోనా మొదటి దశ కంటే రెండో దశలో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. సెకండ్‌ వేవ్‌లో చాలా అపార్ట్‌మెంట్లు, రెసిడెన్షియల్‌ కమ్యూనిటీలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ వాసులు కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇక్కడి అసోసియేషన్లు గ్రూపులుగా ఏర్పడటంతోపాటు సరికొత్త ‘మై గేట్’యాప్‌ ను వినియోగిస్తూ కరోనా వైరస్‌ను కట్టడి చేస్తున్నారు. గత అనుభవాలతో నగరవాసులు ఈ సారి కట్టుదిట్టమైన ముందస్తు జగ్రత్తలు తీసుకుంటున్నారు. తార్నాకలోని నాగార్జున రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో ‘నో మాస్క్‌- నో ట్రేడ్‌’ నినాదాన్ని తీసుకొచ్చారు. ప్రతి నిత్యం అపార్ట్ మెంట్ కి డెలివరీ బాయ్స్, పాలు డెలివరీ చేసేవారు, డ్రైవర్స్ ఇలా చాలా మంది వస్తుంటారు. వారిలో ఎవరికి కరోనా ఉందో తెలియదు. కావునా హైటెక్‌సిటీ, కొండాపూర్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌ ప్రాంతాల్లోని, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు ‘మై గేట్‌’ యాప్‌ను వినియోగిస్తున్నారు.

  ఎవరైనా లోపలికి రావాలంటే వారికి ప్రత్యేక పాస్‌కోడ్‌ ఇస్తూ దాన్ని సెక్యూరిటీ వద్ద ఎంటర్‌ చేసి లోపలికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఇలా కమ్యూనిటీలో పనిచేసే వారందరికీ ఎంట్రీ పాస్‌కోడ్‌ ఇస్తున్నారు. డెలివరీ బాయ్స్‌ వస్తే సదరు వినియోగదారు ఫోన్‌కు నోటిఫికేషన్‌ వస్తుంది. పార్సిల్‌ లోపలికి తీసుకురావాలా? గేట్‌ దగ్గర వదిలేయాలా? అని అనుమతి కోరుతుంది. ఎంచుకున్న ఆప్షన్‌ ఆధారంగా డెలివరీ బాయ్‌ స్పందించొచ్ఛు. ఒక వేల ఎవరికైనా కరోనో సోకితే ఆ అపార్ట్ మెంట్ మొత్తం క్వారంటైన్ జోన్ గా మర్క్ చేసి యాప్ లో ఎంట్రీ చేస్తారు. క్వారంటైన్‌ ముగిశాక ఫ్లాట్‌ని అన్‌బ్లాక్‌ చేస్తారు. ఇలా కొన్ని అపార్ట్ మెంట్ వాసులు ముందు జాగ్రత్తగా చర్యులు తీసుకుంటున్నారు.

  వృద్ధుల ఆరోగ్య పరిస్థితిని తెలసుకోవడానికి ప్రత్యేకంగా ఓ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఈ సంజీవని వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ వైద్యంతో వైద్యుల సలహాలను తీసుకుంటున్నారు. కొన్ని అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా ఓ వైద్యుడిని ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యే వెహికిల్ ఏర్పాటు చేసుకొని వ్యాక్సిన్ సెంటర్ కు పంపిస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: