హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: గూగుల్ ఆండ్రాయిడ్ పాలసీలో మార్పులు.. ఇకపై యూజర్లకు సరికొత్త సేవలు..

Google: గూగుల్ ఆండ్రాయిడ్ పాలసీలో మార్పులు.. ఇకపై యూజర్లకు సరికొత్త సేవలు..

CCI ఆదేశాలకు తలొగ్గిన గూగుల్, ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్‌లో మొత్తం నాలుగు మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. ఆ మార్పులు ఏంటి? వాటి వల్ల భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వంటి వివరాలు తెలుసుకుందాం.

CCI ఆదేశాలకు తలొగ్గిన గూగుల్, ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్‌లో మొత్తం నాలుగు మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. ఆ మార్పులు ఏంటి? వాటి వల్ల భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వంటి వివరాలు తెలుసుకుందాం.

CCI ఆదేశాలకు తలొగ్గిన గూగుల్, ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్‌లో మొత్తం నాలుగు మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. ఆ మార్పులు ఏంటి? వాటి వల్ల భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వంటి వివరాలు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

గూగుల్ (Google) అనైతిక వ్యాపార పద్ధతులు అవలంబిస్తుందనే కారణంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) భారీగా జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్‌ ఎకో సిస్టమ్‌లో గూగుల్ మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు చేస్తూ సీసీఐ ఫైన్ విధించింది. అంతేకాదు, అనైతిక ఇక వ్యాపార పద్ధతులు మానుకోవాలని హితవు పలుకుతూ మార్పులు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో గూగుల్ ఈ ఆరోపణలపై లీగల్‌గా పోరాడుతూనే తాజాగా భారతదేశంలో తమ బిజినెస్ పాలసీల్లో (Business Policies) మార్పులు చేయడానికి సిద్ధమైంది. CCI ఆదేశాలకు తలొగ్గిన గూగుల్, ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్‌లో మొత్తం నాలుగు మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. ఆ మార్పులు ఏంటి? వాటి వల్ల భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వంటి వివరాలు తెలుసుకుందాం.

గూగుల్ డిఫాల్ట్ సెర్చ్ ఆప్షన్ కాదు

సాధారణంగా ఆండ్రాయిడ్ యూజర్లకు తమ డివైజ్‌ సెటప్ చేసుకోగానే గూగుల్ డిఫాల్ట్ సెర్చ్ ఆప్షన్‌గా మారిపోతుంది. దీనిని మార్చుకోగల స్వేచ్ఛ కూడా ఉండదు. అయితే కొత్తగా గూగుల్ తీసుకొచ్చే మార్పు వల్ల సెటప్ ప్రాసెస్ సమయంలో ఇండియన్ యూజర్లు తమ కొత్త ఆండ్రాయిడ్ డివైజ్‌లో తమకు నచ్చిన సెర్చ్ ఇంజన్‌ను ఎంచుకోగలుగుతారు. ఇందుకు వీలుగా భారతదేశంలో ఆండ్రాయిడ్ డివైజ్‌ సెటప్ చేసేటప్పుడు Bing, యాహు వంటి సెర్చ్ ఇంజన్లను ఎంపిక చేసుకోగల ఒక స్క్రీన్‌ను గూగుల్ అందించనుంది.

Google: భారత్ దెబ్బకి దిగివచ్చిన గూగుల్.. పాలసీలో మార్పులు.. యూజర్లకు కొత్త సేవలు

ప్రీలోడెడ్ గూగుల్ యాప్స్ ఉండవు

గూగుల్, హ్యాండ్‌సెట్ పార్ట్నర్స్‌ అయిన క్రోమ్, గూగుల్‌పే, డ్రైవ్, ఫొటోస్, యూట్యూబ్, మ్యాప్స్ వంటి వాటిలో సైన్ అప్ చేయాల్సిందిగా ఆండ్రాయిడ్ యూజర్లను బలవంతం చేస్తుంది. గూగుల్ ఈ యాప్‌లను ప్రీలోడెడ్‌గా ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో అందిస్తుంది. వీటిని అన్ఇన్‌స్టాల్ చేయడం కూడా కుదరదు. అయితే త్వరలో ఈ యాప్స్‌ను ఆండ్రాయిడ్ ఓఎస్ వాడే ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్ చేయకూడదని గూగుల్ నిర్ణయించింది. అంటే కొత్త మార్పు వల్ల గూగుల్ యాప్స్ బ్లోట్‌వేర్‌గా రావు. అలానే శామ్‌సంగ్ వంటి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చర్(OEM)లు తమ యూజర్ల కోసం తమ డివైజ్‌లలో ఏ గూగుల్ యాప్‌లను ప్రీలోడ్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవచ్చు. దీనర్థం ఇతర యాప్ డెవలపర్లు ఇండియన్‌ యూజర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది.

యాప్‌ సైడ్‌లోడింగ్

గూగుల్ ప్రైవసీ విషయంలో కూడా కొత్త మార్పు తీసుకురానుంది. ఈ టెక్ దిగ్గజం ఇకపై యూజర్లు ఇతర సోర్స్‌ల నుంచి హానికరమైన యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తుంటే వారిని హెచ్చరిస్తుంది. జెన్యూన్‌ యాప్, హానికరమైన యాప్‌ మధ్య తేడాను తెలుసుకునేందుకు యూజర్లకు సహాయపడుతుంది. ఇందుకు కంపెనీ ఆండ్రాయిడ్ ఇన్‌స్టాలేషన్ ఫ్లో, సైడ్‌లోడెడ్ యాప్‌ల విషయంలో ఆటో-అప్‌డేటింగ్ సామర్థ్యానికి మార్పులు చేస్తుంది. ఇది యూజర్లు తమ డివైజ్‌లో ఇన్‌స్టాల్ చేస్తున్న యాప్‌ల నేచర్ గురించి మెరుగైన స్పష్టతను ఇస్తుంది.

గూగుల్ ప్లే స్టోర్‌తో సంబంధం లేకుండా యాప్ బిల్లింగ్

గూగుల్ తీసుకొచ్చే మరో మార్పు వల్ల భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లు డెవలపర్లు బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించుకోగలుగుతారు. దీనర్థం వినియోగదారులు ఎక్స్‌టర్నల్ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా ఇన్-యాప్‌ పర్చేజ్లకు మనీ చెల్లించవచ్చు. అయితే యూజర్లకు ప్లే స్టోర్ బిల్లింగ్ సిస్టమ్‌ కూడా ఒక ఆప్షన్‌గా అందుబాటులో ఉంటుంది.

First published:

Tags: Google, Google app

ఉత్తమ కథలు