హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Chinagari యాప్ వాడుతున్నారా...అయితే జాగ్రత్త...ఇందులో ఉన్న పెద్ద లోపం ఇదే...

Chinagari యాప్ వాడుతున్నారా...అయితే జాగ్రత్త...ఇందులో ఉన్న పెద్ద లోపం ఇదే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

హ్యాకర్ యూజర్ సమాచారాన్ని తెలుసుకుంటే చాలు. ఆ తరువాత ఆ యూజర్ ఖాతా నుంచి హ్యాకర్ తనకు నచ్చిన వీడియోను ఎంచక్కా అప్ లోడ్ చేసేయవచ్చు. యూజర్స్ అకౌంట్స్ నుంచి అసభ్యకరమైన వీడియోలు అప్ లోడ్ చేస్తే వారి వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇంకా చదవండి ...

చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ నిషేధం తరువాత, చింగారి(Chingari app) యాప్‌ ప్రస్తుతం ట్రెండింగ్ యాప్ గా మారింది. అయితే ఇందులో లోపాలు ఉన్నాయని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ యాప్ భద్రతలో సమస్య ఉంది, తద్వారా ఎవరైనా యూజర్ అకౌంట్ ను సులభంగా హ్యాక్ చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. హ్యాకర్ యూజర్ సమాచారాన్ని తెలుసుకుంటే చాలు. ఆ తరువాత ఆ యూజర్ ఖాతా నుంచి హ్యాకర్ తనకు నచ్చిన వీడియోను ఎంచక్కా అప్ లోడ్ చేసేయవచ్చు. అయితే ఇలా చేస్తే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయా అకౌంట్స్ నుంచి అసభ్యకరమైన వీడియోలు అప్ లోడ్ చేస్తే వారి వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

హ్యాకర్స్ న్యూస్ తన నివేదికలోని దీనికి సంబంధించిన వీడియోను పంచుకుంది. అంతేకాదు అందులోని లోపం గురించి చెప్పింది. పైగా ఈ హ్యాకింగ్ ఎంత సులభంగా చేయవచ్చో కూడా చూపించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్‌కోడ్‌తో కలిసి పనిచేసే గిరీష్ కుమార్, ది హ్యాకర్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, యూజర్ ప్రొఫైల్ నుంచి సమాచారం పొందడానికి చింగారిలోని లోని ర్యాండమ్ యూజర్ ఐడిలను ఉపయోగిస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియోను గిరీష్ కుమార్ చూపించారు. ఇందులో హ్యాకర్ HTTP రిక్వెస్ట్ లో యూజర్ IDని భర్తీ చేసి తద్వారా అతడి అకౌంట్ ఎలా యాక్సెస్ చేయవచ్చో చూపించాడు.

' isDesktop="true" id="554320" youtubeid="GuGCfGSNmMQ" category="technology">

కుమార్ ఈ సమాచారాన్ని చింగారి యాప్ కు ఇప్పటికే తెలిపాడు. ఆ తర్వాత కంపెనీ సెక్యూరిటీ ప్యాచ్‌ను విడుదల చేసింది. చింగారీ (వి 2.4.0 ) భద్రతలో లోపం ఉందని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. ఈ లోపం గుర్తించామని, అయితే ప్రస్తుతం Android Play Store, iOS App Store రెండింటిలో చింగారీ యాప్ ను అప్ డేట్ చేసినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం ఎవరైతే చింగారీ యాప్ వేసుకున్నారో వెంటనే యాప్ ను అప్ డేట్ చేసుకోవాలని కంపెనీ కోరింది.

First published:

Tags: Technology, Tik tok

ఉత్తమ కథలు