హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Money: ఈ యాప్‌తో సులభంగానే డబ్బు సంపాదించొచ్చు.. ఎలా అంటే?

Money: ఈ యాప్‌తో సులభంగానే డబ్బు సంపాదించొచ్చు.. ఎలా అంటే?

 Money: ఈ యాప్‌తో సులభంగానే డబ్బు సంపాదించొచ్చు.. ఎలా అంటే?

Money: ఈ యాప్‌తో సులభంగానే డబ్బు సంపాదించొచ్చు.. ఎలా అంటే?

Tik Tok | మీరు టిక్ టాక్ వీడియోలు, రీల్స్ వంటివి చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. మీరు చింగారి యాప్ ద్వారా డబ్బు సంపాదించొచ్చు. కంపెనీ కొత్త కంటెంట్ మానిటైజేషన్ ప్లాన్స్ తీసుకువచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Chingari Video App | టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత దేశీ షార్ట్ వీడియో యాప్స్‌కు మంచి ఆదరణ లభించింది. చాలా మంది ఈ యాప్స్ వైపు మళ్లారు. ఇలాంటి యాప్స్‌లో (Apps) చింగారి కూడా ఒకటి. చింగారి యాప్‌ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కంటెంట్ మానిటైజేషన్ ప్లాన్ తీసుకువచ్చింది. క్రియేటర్లు దీని ద్వారా ప్రయోజనం పొందొచ్చు. డబ్బులు (Money) సంపాదించొచ్చు. ఎలానో ప్పుడు తెలుసుకుందాం.

చింగారి తాజాగా మూడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. రోజు, వారం, నెల ఇలా మూడు ప్లాన్స్ ఉంటాయి. ఒక రోజు ప్లాన్ అయితే రూ. 20 చెల్లించాలి. వారం రోజుల సబ్‌స్క్రిప్షన్ అయితే రూ. 100 కట్టాలి. ఇక నెల రోజుల సబ్‌స్క్రిప్షన్ అయితే రూ. 300 చెల్లించాలి. ఇలా సబ్‌స్క్రిప్షన్ పొందిన వారు డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. గరి మైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ గడువులో వచ్చిన మొత్తాన్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ సిమ్ వాడే వారికి షాక్.. రీచార్జ్ ధరలను భారీగా పెంచేసిన కంపెనీ!

గరి మైనింగ్ ప్రోగ్రామ్ కింద చింగారి తన క్రియేటర్లకు, యూజర్లకు క్రిప్టో టోకెన్లు ఇస్తుంది. అప్‌లోడింగ్, వాచింగ్, లైకింగ్, కామెంటిం, షేరింగ్ వంటివి చేస్తే క్రిప్టో టోకెన్లు వస్తాయి. ఇవి క్రిప్టో ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అవుతాయి. తర్వాత క్రిప్టో వాలెట్‌లోకి విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో భాగంగా క్రియేటర్లు, యూజర్లు ఎర్నింగ్స్‌ను నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌టీవీపై రూ.669 ఈఎంఐ ఆఫర్.. ఇంకా 30 శాతం డిస్కౌంట్‌!

చింగారి సీఈవో, కోఫౌండర్ సుమిత్ ఘోష్ మాట్లాడుతూ.. కంటెంట్ మానిటైజేషన్ అనేది చాలా మంది క్రియేటర్లకు ఇప్పటికీ సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. అయితే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా వారికి ఊరట కలిగే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తక్కువ ధరతో టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోని క్రియేటర్లు కూడా వారి వీడియోలను మానిటైజ్ చేసుకోవచ్చని వివరించారు.

అంతేకాకుండా మిగతా అన్ని ప్రధానమైన ప్లాట్‌ఫామ్స్ యూజర్లను పూర్తిగా విస్మరించాయని పేర్కొన్నారు. అయితే వినియోగదారులు చింగారి యాప్‌ను ఉపయోగించినందుకు నిజమైన నగదు రూపంలో రివార్డ్‌ను పొందుతున్నారని తెలిపారు. ఇలా క్రియేటర్లకు, యూజర్లకు చింగారి ప్రయోజనం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే దేశంలో కేంద్ర ప్రభుత్వం గతంలో పలు యాప్స్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో టిక్ టాక్, హలో, యూసీ వంటి ప్రముఖ యాప్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పబ్‌జీ కూడా ఈ లిస్ట్‌లో ఉంది.

First published:

Tags: Apps, Money, Tik tok, Videos

ఉత్తమ కథలు