బడ్జెట్ ధర (Budget Price)లో లభించే చైనా స్మార్ట్ఫోన్ల(China Smartphones)ను భారత్ (India) నిషేధిస్తుందని, మార్కెట్లో ఇక తక్కువ ధరకు స్మార్ట్ఫోన్లు దొరకవనే వార్తలు ఇటీవల సోషల్ మీడియా(Social Media)లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో బడ్జెట్ ఫోన్లు తక్కువ ధరలో లభించవేమోనని వినియోగదారులు వర్రీ అవుతుంటే, స్మార్ట్ఫోన్ల బిజినెస్‌లో ఎక్కువ లాభాలు గడించే దుకాణదారులు టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో చైనీస్ బ్రాండ్ల నిషేధం వార్తలపై ఎలక్ట్రానిక్స్ రిలైటర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. జైపూర్‌లోని సన్నీ ఎలక్ట్రానిక్స్ పేరుతో స్మార్ట్ఫోన్ల బిజినెస్ చేస్తున్న స్థానిక రిటైలర్ దీనిపై స్పందించిన తీరు లోకల్ బ్రాండ్స్‌ను భారత ప్రభుత్వాన్ని ఆలోచింపజేస్తోంది.
ఎలక్ట్రానిక్స్ స్టోర్ ప్రతినిధి మాట్లాడుతూ ‘లావా, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ వంటి ఇండియన్ కంపెనీలు ఈ నిర్ణయంతో ఎక్కువ ప్రయోజనం పొందుతాయి. అయితే ప్రారంభంలో చైనీస్ బ్రాండ్లు మంచి ప్రొడక్ట్స్‌ను అందించడం ద్వారా ఇండియన్ మార్కెట్‌కు అంతరాయం కలిగించాయి. దీంతో క్రమంగా ఇండియన్ బ్రాండ్లకు ఆదరణ తగ్గిపోయింది. నేను ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను,
కానీ రూ. 12,000 లోపు ఫోన్ల కోసం వెతుకుతున్న వినియోగదారులు మంచి ఫీచర్లతో నాన్-చైనీస్ బ్రాండ్ ఫోన్లను కొనుగోలు చేయడం కష్టమని నేను భావిస్తున్నాను. మన సొంత బ్రాండ్లు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి అనేది గొప్ప విషయం. కానీ ఇండియన్ బ్రాండ్లు విదేశీ కంపెనీల ఫోన్ భాగాలను దిగుమతి చేసుకొని, వాటిని భారతదేశంలో అసెంబ్లింగ్ చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు.
* లోకల్ బ్రాండ్స్‌కు మద్దతుగా..
గత కొంతకాలంగా ఒప్పో, రియల్ మి, వన్ ప్లస్, షావోమి, వివో, ఇతర చైనా బ్రాండ్లనే కస్టమర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను అందిస్తుండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఇండియన్ బ్రాండ్స్ కనుమరుగవుతున్నాయి. అందుకే భారత ప్రభుత్వం రూ. 12,000 లోపు ధర ఉన్న చైనా బ్రాండ్ స్మార్ట్ఫోన్లను బ్యాన్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. లోకల్ బ్రాండ్స్‌కు ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే సగటు భారతీయ కొనుగోలుదారుడు, డబ్బుకు ఎక్కువ విలువను పొందాలని డిమాండ్ చేస్తున్నాడు. 2014లో Xiaomi కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తక్కువ ధరకే హై రేంజ్ ఫీచర్లతో ఫోన్లు విక్రయిస్తూ అమ్మకాలు పెంచుకుంది. అప్పటి నుంచి కొనుగోలుదారుల్లో డబ్బుకు ఎక్కువ విలువను పొందాలనే కోరిక నాటుకుంది.
దేశంలో 4G సేవలు ప్రారంభమైనప్పుడు కూడా చైనీస్ బ్రాండ్లు మాత్రమే అనుకున్న బడ్జెట్లో 4G డివైజ్‌లను అందుబాటులోకి తెచ్చాయి. దాంతో 2022 నాటికి భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేర్లో చైనా ఫోన్ల వాటా 63% శాతానికి పెరిగింది. ఇది భారతీయ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావమే చూపింది.
అయితే కొంతమంది షాప్ కీపర్లు వ్యాపారాల కోసం చైనా ఫోన్లపైనే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. నిజంగా చైనా ఫోన్లు నిషేధిస్తే లాభాలు తగ్గవచ్చని వారు భయపడుతున్నారు. మొత్తానికి చైనీస్ బడ్జెట్ ఫోన్లను బ్యాన్ చేయాలని ప్రభుత్వం భావిస్తే.. ఈ నిర్ణయం కొంతమందికి లాభం, మరికొంత మందికి నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Smart phone, Smart phones, Tech news, Technolgy