iPhone: ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. ఆ తర్వాత ట్విస్ట్

స్నేహితుల దగ్గర గొప్పగా చూపించడానికి ఐఫోన్ కొనాలనుకున్నానని అతడు చెప్పాడు. అందుకు డబ్బులు లేక కిడ్నీ అమ్మాలని నిర్ణయించుకున్ననానని వాంగ్ వివరించాడు.

news18-telugu
Updated: November 17, 2020, 6:34 PM IST
iPhone: ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. ఆ తర్వాత ట్విస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యాపిల్ కొత్త ఐఫోన్‌ను లాంచ్ చేసిన ప్రతిసారీ నెటిజన్లు సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్‌ రూపొందించి పోస్ట్ చేస్తుంటారు. అప్పట్లో ఐఫోన్‌ ధరలను ప్రస్తావిస్తూ, దాన్ని కొనాలంటే కిడ్నీ అమ్ముకోవాల్సిందేనని ఒక వ్యక్తి పోస్ట్ చేసిన జోక్ వైరల్‌గా మారింది. విచిత్రం ఏంటంటే, గతంలో ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్న సంఘటనలు నిజంగానే వెలుగుచూశాయి. అప్పటి నుంచే ఐఫోన్‌ విడుదలైతే కిడ్నీ జోకులు ఇంటర్నెట్‌ను ముంచెత్తుతున్నాయి. చైనాకు చెందిన ఒక యువకుడు ఐఫోన్ 4, ఐప్యాడ్ 2 డివైజ్‌లు కొనడానికి కిడ్నీ అమ్ముకొని, జోక్‌ను రియాలిటీగా మార్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అనారోగ్యంతో మంచాన పడ్డాడు. ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తి పేరు వాంగ్ షాంగ్‌కున్. 2011లో 17 ఏళ్ల వయసులో అతడు కిడ్నీ అమ్ముకున్నాడు. ప్రస్తుతం అతడు అనారోగ్యంతో మంచాన పడ్డాడు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వాంగ్‌కు డయాలసిస్ చేస్తున్నారు. కిడ్నీ అమ్ముకున్న కొన్ని నెలల తరువాత, అతడి శరీరంలో ఉన్న మరో కిడ్నీలో సమస్యలు ఏర్పడ్డాయి. క్రమంగా అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కిడ్నీ వైఫల్యం వల్ల ఇప్పుడు అతడు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది.

ఐఫోన్‌ అంటే ఇష్టం

యాపిల్ ఐఫోన్, ఐపాడ్లను కొనడానికి అప్పట్లో వాంగ్ ఎంతో కష్టపడ్డాడు. యాపిల్ ఉత్పత్తులు అంటే అతడికి ఎంతో ఇష్టం. వాటిని కొనలేక నిరాశపడ్డాడు. దీంతో ఆన్‌లైన్‌లో అవయవాలు అమ్ముతూ అక్రమంగా సొమ్ము చేసుకునే వారిని వాంగ్ సంప్రదించాడు. తన కిడ్నీని 20,000 యువాన్లకు అమ్ముకున్నాడు. సెంట్రల్ హునాన్ ప్రావిన్స్‌లో చట్ట విరుద్ధంగా ఆపరేషన్ చేయించుకున్నాడు. తనకు ఒక్క కిడ్నీ చాలని అప్పట్లో వాంగ్ చెప్పాడని ఫాక్స్‌ న్యూస్ వార్తాసంస్థ గత సంవత్సరం తెలిపింది.

ఎవరికీ తెలియకుండా...
తల్లిదండ్రుల అనుమతి లేకుండానే వాంగ్‌కు ఆపరేషన్ జరిగిందని ఫాక్స్‌న్యూస్ చెబుతోంది. స్థానిక ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు అతడికి సర్జరీ చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఆపరేషన్ చేసిన సర్జన్లు కూడా ఉన్నారు. కేసు నమోదైన అదే సంవత్సరంలో వాంగ్ షాంగ్‌కున్ కుటుంబానికి సుమారు 3,00,000 డాలర్ల పరిహారం అందింది. స్నేహితుల దగ్గర గొప్పగా చూపించడానికి ఐఫోన్ కొనాలనుకున్నానని అతడు చెప్పాడు. అందుకు డబ్బులు లేక కిడ్నీ అమ్మాలని నిర్ణయించుకున్ననానని వాంగ్ వివరించాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 17, 2020, 6:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading