Home /News /technology /

CHINESE FIRM CLAIMS TO BUILD ELECTRIC BATTERY THAT ENABLES 1000 KM ON SINGLE CHARGE UMG GH

Electric Battery: చైనా బ్యాటరీ.. ఒక్కసారి ఛార్జ్‌చేస్తే వెయ్యి కిలోమీటర్లే.. ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసమే ప్రత్యేకంగా..!

చైనా బ్యాటరీ.. ఛార్జింగ్ పెడితే వెయ్యి కిలోమీటర్లే

చైనా బ్యాటరీ.. ఛార్జింగ్ పెడితే వెయ్యి కిలోమీటర్లే

చైనీస్ ఆటోమోటివ్ లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ కంపెనీ కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ కో లిమిటెడ్ (CATL) ఓ సరికొత్త ఎలక్ట్రిక్ బ్యాటరీ (Electric Battery)ని ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు అమర్చే ఈ బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 1,000 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles)కు ప్రజాదరణ పెరుగుతోంది. వాహన తయారీ కంపెనీలు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. అయితే ఈ వాహనాల్లో రేంజ్ (Driving Range) అనేది చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బ్యాటరీ తయారీ కంపెనీలు అత్యధిక రేంజ్ అందించే పవర్‌ఫుల్ బ్యాటరీ (Batteries)లను తయారు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ చైనీస్ ఆటోమోటివ్ లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ కంపెనీ కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ కో లిమిటెడ్ (CATL) ఓ సరికొత్త ఎలక్ట్రిక్ బ్యాటరీ (Electric Battery)ని ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు అమర్చే ఈ బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 1,000 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. థర్డ్-జనరేషన్ సెల్-టు-ప్యాక్ (CTP) టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ బ్యాటరీని క్విలిన్ (Qilin) లేదా సీటీపీ (CTP) 3.0 బ్యాటరీ అని కంపెనీ పిలుస్తోంది. ఈ సరికొత్త బ్యాటరీ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వచ్చే ఏడాదిలో లాంచ్
కంపెనీ చెప్పిన ప్రకారం, క్విలిన్ బ్యాటరీకి 72 శాతం వాల్యూమ్ యుటిలైజేషన్ ఎఫిషియన్సీ ఉంది. అలానే ఈ బ్యాటరీ టెర్నరీ బ్యాటరీ సిస్టమ్‌ల కోసం 255 Wh/kg వరకు ఎనర్జీ డెన్సిటీని అందిస్తుంది. సీఏటీఎల్ (CATL) ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక ఇంటిగ్రేషన్ లెవెల్‌తో క్విలిన్ బ్యాటరీని రూపొందించడం జరిగింది. చైనీస్ పురాణాల్లో కనిపించే క్విలిన్ అనే ఒక జీవి పేరు మీద ఈ బ్యాటరీకి నామకరణం చేశారు. సీఏటీఎల్ ప్రకారం, బ్యాటరీల మాస్ ప్రొడక్షన్ కొద్ది నెలలలో ప్రారంభం కానుంది. ఈ బ్యాటరీలు 2023లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. సీఏటీఎల్ కంపెనీ ఇప్పటికే తన బ్యాటరీలను టెస్లా, వోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ, నియో వంటి ఆటోమొబైల్ సంస్థలకు సరఫరా చేస్తోంది.



ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్
సీటీపీ టెక్నాలజీ సిస్టమ్‌లో మాడ్యూల్స్ లేకుండా సెల్‌లను నేరుగా ప్యాక్‌లలోకి చేర్చడం జరుగుతుంది. దీనివల్ల ఎనర్జీ డెన్సిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బ్యాటరీల తయారీ మరింత ఈజీ అవ్వడంతో పాటు తయారీ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. విశేషమేంటంటే, సీటీపీ 3.0 బ్యాటరీ సర్వీస్ లైఫ్, సేఫ్టీ, ఛార్జింగ్ స్పీడ్, లో-టెంపరేచర్ పర్ఫామెన్స్‌ లాంటి విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ బ్యాటరీలో ఆఫర్ చేసిన ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ యూనిట్ వల్ల ప్రొడక్ట్ అనేది ఫుల్-లైఫ్-సైకిల్ రిలయబిలిటీతో పాటు షాక్, వైబ్రేషన్‌ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ యూనిట్‌ను సెల్, మల్టీఫంక్షనల్ ఎలాస్టిక్ ఇంటర్‌లేయర్‌తో కంపెనీ తయారు చేసింది. బ్యాటరీ థర్మల్ స్టెబిలిటీ, సేఫ్టీతో వస్తుంది. అందువల్ల ప్రొడక్ట్ అప్‌గ్రేడ్‌లలో హయ్యెర్ ఎనర్జీ డెన్సిటీ మెటీరియల్స్‌కు అనుకూలంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులలో ఈ బ్యాటరీలోని సెల్‌ వేగంగా కూల్ అవుతుంది. తద్వారా సెల్స్ మధ్య అస్థిరమైన థర్మల్ కండక్షన్ నిరోధిస్తుంది. అంటే ఇందులో అగ్ని ప్రమాదం నిరోధించే టెక్నాలజీ ఇచ్చారని చెప్పవచ్చు. ఈ బ్యాటరీ ఫాస్ట్ మోడ్‌లో ఛార్జింగ్ చేయడానికి కేవలం 10 నిమిషాలు పడుతుంది.
Published by:Mahesh
First published:

Tags: Battery, China, Electric bike, Electric Vehicles

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు