• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • CHINA SUCCESSFULLY LANDS SPACECRAFT ON MOON TO RETRIEVE LUNAR ROCKS NS

Chang'e-5: చంద్రుడిని చేరిన చైనా అంతరిక్ష నౌక.. జాబిల్లి నుంచి ఏం తీసుకు రానుందో తెలుసా..

Chang'e-5: చంద్రుడిని చేరిన చైనా అంతరిక్ష నౌక.. జాబిల్లి నుంచి ఏం తీసుకు రానుందో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

చంద్రుడిపై సాగుతున్న పరిశోధనల్లో చైనా మరో ముందడుగు వేసింది. చంద్రుడిపై నుంచి నుంచి మట్టి, రాళ్లను సేకరించి వాటిని భూమికి తీసుకువచ్చేందుకు ఆ దేశం చాంగే-5 అనే అంతరిక్షనౌకను చంద్రుడిపైకి పంపించింది.

  • Share this:
    చంద్రుడిపై సాగుతున్న పరిశోధనల్లో చైనా మరో ముందడుగు వేసింది. చంద్రుడిపై నుంచి నుంచి మట్టి, రాళ్లను సేకరించి వాటిని భూమికి తీసుకువచ్చేందుకు ఆ దేశం చాంగే-5 అనే అంతరిక్షనౌకను చంద్రుడిపైకి పంపించింది. మంగళవారం ఆ నౌక విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై దిగిందని చైనా ప్రభుత్వం తెలిపింది. ఎంపిక చేసిన ప్లేస్ లో, ఊహించిన విధంగా ఆ నౌక కాలు మోపిందని చైనా ప్రకటించింది. ఈ నౌకను చైనా నవంబర్ 24న ప్రయోగించింది. ఈ మిషన్ చంద్రుడిపై ఇంతకు ముందు ఎవరు సందర్శించని ప్రదేశం నుంచి దాదాపుగా 2 కేజీల సాంపుల్స్ ను తీసుకురానుంది. అనుకున్న ప్రకారం ఈ మిషన్ పూర్తయితే చంద్రుడిపై నుంచి నమూనాలను తీసుకువచ్చిన మూడో దేశంగా చైనా నిలవనుంది. ఇప్పటి వరకు ఆ ఘనత సాధించిన దేశాలుగా అమెరిక మొదటి స్థానంలో, సోవియట్ యూనియన్ రెండో స్థానంలో ఉన్నాయి.

    ఇదిలా ఉంటే.. శుక్ర గ్రహానికి చెందిన గ్రహశకలాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలు చంద్రుడి ఉపరితలాన్ని చేరే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. చందమామ, శుక్రుడికి మధ్య 38 మిలియన్ కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. ఇదంతా శూన్యంగా(వ్యాక్యూమ్ స్పేస్) ఉంటుంది. ఇంత దూరం ప్రయాణించి గ్రహశకలాలు చంద్రుడిని చేరుతాయని మనం నమ్మలేం.

    కానీ ఇందుకు అవకాశాలున్నాయని యేల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు శామ్యూల్ కాబోట్, గ్రెగొరీ లాఫ్లిన్ చెబుతున్నారు. తోకచుక్కలు, గ్రహశకలాల ప్రభావం వల్ల శుక్రుడి ఉపరితలం నుంచి 10 బిలియర్ రాళ్లు విడిపోయి ఉండొచ్చని శామ్యూల్ కాబోట్, గ్రెగొరీ లాఫ్లిన్ తెలిపారు. అంతరిక్షంలో తేలియాడే ఈ రాళ్లు ఇతర గ్రహాల కక్ష్యల్లోకి వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు. గురుత్వాకర్షణ వల్ల ఈ స్పేస్‌ రాక్స్‌ చంద్రుడి మీదకు కూడా వెళ్లొచ్చని వారు ప్రకటించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు