news18-telugu
Updated: September 4, 2020, 5:10 PM IST
PUBG ban: పబ్‌జీ బ్యాన్‌తో చైనాకు ఎంత నష్టమో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)
పబ్‌జీ బ్యాన్‌తో చైనాకు ఎంత నష్టమో తెలుసా? రూ.5,000 కోట్లు. ఇక పబ్‌జీ డెవలపర్ అయిన టెన్సెంట్ గేమ్స్‌కు గట్టి దెబ్బ తగిలింది. రెండు రోజులుగా కంపెనీ షేర్ ధర పతనం అవుతోంది. 14 బిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూను కోల్పోయింది ఈ సంస్థ. పబ్‌జీ మొబైల్‌కు భారతదేశం అతిపెద్ద మార్కెట్ అన్న సంగతి తెలిసిందే. 17.5 కోట్ల సార్లు ఈ యాప్‌ను ఇండియాలో ఇన్‌స్టాల్ చేయడం విశేషం. 2020 జూలై నాటికి రూ.22,500 కోట్లు ఆదాయం రావడం విశేషం. ఇప్పుడు పబ్‌జీ మొబైల్‍ను బ్యాన్ చేయడంతో టెన్సెంట్‌తో పాటు చైనాకు భారీ నష్టం తప్పలేదు. చైనాకు చెందిన అతిపెద్ద మొబైల్ కంపెనీ అయిన టెన్సెంట్ పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను రూపొందించింది. ఇండియాలో ఈ గేమ్ అడుగుపెట్టిననాటి నుంచి ఏదో ఓ రకంగా వార్తల్లో ఉంటోంది. కుర్రాళ్లలో ఈ గేమ్ ఓ వ్యసనంగా మారింది. ప్రస్తుతం మొబైల్ వర్షన్‌పైనే నిషేధం విధించింది భారత ప్రభుత్వం. పీసీ, గేమింగ్ కన్సోల్‌లో పబ్‌జీ అందుబాటులో ఉంది.
Realme 7 Pro vs OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్‌కు పోటీగా రియల్‌మీ 7 ప్రో... ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్Samsung Galaxy Tab S7: సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 సేల్... రిలయెన్స్ డిజిటల్‌లో ఆఫర్స్
భారత ప్రభుత్వం పబ్‌జీ సహా 118 యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ 118 యాప్స్ జాబితాలో పాపులర్ ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్ అయిన పబ్‌జీ మొబైల్ కూడా ఒకటి. ఇటీవల తూర్పు లడఖ్‌లో సరిహద్దులో చైనాతో ఘర్షణ తర్వాత పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చైనా యాప్స్‌పై నిషేధం విధించడం ఇది మూడోసారి. అంతకుముందు బ్యాన్ చేసిన యాప్స్‌లో టిక్‌టాక్, హెలో లాంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి.
Published by:
Santhosh Kumar S
First published:
September 4, 2020, 5:10 PM IST