• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • CHINA MARS ROVER ZHURONG TAKES FIRST DRIVE ON SURFACE OF RED PLANET SAYS CHINA OFFICIAL SOCIAL MEDIA HERE IS THE FULL DETAILS NK

China Mars Rover: మార్స్‌పై తిరిగిన చైనా రోవర్... ఆ కొండ చివర ఏం చూసిందంటే...

మార్స్‌పై తిరిగిన చైనా రోవర్ (File image credit - twitter)

China Mars Rover: అంగారక గ్రహంపై తన రోవర్ ఝురాంగ్‌ని దింపిన చైనా... దాన్ని కదిలించే పని ప్రారంభించింది. మొదటి కదలిక విజయవంతం అయ్యింది. అక్కడ ఏం చూసిందో తెలుసుకుందాం.

  • Share this:
    China Mars Rover: అమెరికా నాసా (NASA) సంగతేమోగానీ... చైనా మాత్రం మార్స్ గ్రహంపై కాలనీ నిర్మించేందుకు బలమైన పట్టుదలతో అడుగులు వేస్తోంది. తాజాగా చైనాకి చెందిన ఝురాంగ్ రోవర్... మొదటిసారిగా మార్స్ గ్రహంపై... ఓ రౌండ్ వేసింది. మన ఇళ్లలో రిమోట్ కారు ఎలాగైతే పనిచేస్తుందో... చైనా రోవర్ కూడా అంతే... భూమిపై నుంచి చైనా శాస్త్రవేత్తలు కమాండ్స్ ఇస్తూ ఉంటే... 33 కోట్ల కిలోమీటర్ల అవతల ఉన్న మార్స్‌పై రోవర్ పనిచేస్తుంది. నిజానికి ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే... చైనాలో ఓ సిగ్నల్ ఇస్తే... ఆ సిగ్నల్ మార్స్ రోవర్‌ని చేరడానికి 5 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఆ సిగ్నల్ అందుకొని... ఆ రోవర్ కదిలితే... అది కదిలినట్లుగా తెలిపే ఫొటో తిరిగి చైనా చేరడానికి మరో 5 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఇలా... ఆ రోవర్ పది కమాండ్లు అందుకొని పనిచెయ్యడానికి... ఐదారు గంటలు పడుతుంది. అంటే సైంటిస్టులు ఎంతో ఓపికతో పనిచెయ్యాల్సిందే.

    మార్స్ చెంతకు... ఒకేసారి ఆర్బిటర్‌ను, ల్యాండర్‌ను, రోవర్‌ను ప్రయోగించి సక్సెస్ అవ్వడమే కాక... రోవర్‌ను విజయవంతంగా నడిపిన తొలి దేశంగా చైనా రికార్డ్ సృష్టించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఝురాంగ్ అంటే... చైనా జానపద కథల ప్రకారం... నిప్పు. ఇది ఆదివారం ఉదయం మార్స్‌పై నడిచినట్లు చైనా అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది.


    ఇప్పటివరకూ మార్స్‌పై రోవర్లను అమెరికా మాత్రమే నడిపించగలిగింది. ఇప్పుడు ఈ లిస్టులో చైనా కూడా చేరింది. 1971లో రష్యా సోవియట్ యూనియన్... ఓ క్రాఫ్ట్‌ని మార్స్‌పై దింపింది. అది సెకండ్లలోనే పనిచేయడం మానేసింది. 240 కేజీల ఝురాంగ్‌కి... 6 రకాల సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయి. దీనికి ఉన్న హై-రిజల్యూషన్ టోపోగ్రఫీ కెమెరా... మార్స్ మట్టి, వాతావరణాన్ని పరిశోధించనుంది. సూర్య శక్తితో పనిచేసే ఈ రోవర్... మార్స్‌పై పూర్వం ఏ జీవులైనా ఉండేవా అనేది తెలుసుకోనుంది. నీరు, ఐస్ ఉండేవా అనేది కనిపెట్టనుంది. ఇందుకోసం భూమిలోకి ఓ రాడార్‌ను పంపనుంది. 90 రోజులపాటూ ఈ పరిశోధన సాగనుంది.

    జురాంగ్... మూడు రోజులపాటూ... 33 అడుగుల దూరం వెళ్లనుందని చైనా అధికారిక స్పేస్ న్యూస్ తెలిపింది. ఇంత నెమ్మదిగా వెళ్లడం ఎందుకూ అంటే... మార్స్ వాతావరణాన్ని అర్థం చేసుకుంటూ... కమాండ్లు ఇస్తామని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. రోవర్ వేగంగా పనిచేసి... పొరపాటున దెబ్బతింటే... ఇక పనిచేయకపోతే... చాలా ఇబ్బంది కాబట్టే... ఇలా చేస్తున్నట్లు తెలిపారు.

    ఇది కూడా చదవండి: Nasal vaccines: భారత నాసల్ వ్యాక్సిన్లపై WHO హర్షం... కరోనాకి మూడినట్లేనా?

    మార్స్ మన భూమి అంత ఆనందంగా ఉండదు. రాత్రివేళ ఉష్ణోగ్రతలు మైనస్ 130 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతాయి. కార్బన్ డై ఆక్సైడ్ కూడా గడ్డకట్టేస్తుంది. మార్స్ ఉపరితలం మొత్తం మంచుతో నిండిపోతుంది. అలాంటి చోట రోవర్ ఇంచు కూడా కదల్లేదు. రోవర్ పాడవకుండా... దానికి నానో-ఏరోజెల్ ప్లేట్స్ వాడారు. అవి దాన్ని తుప్పు పట్టకుండా కాపాడుతాయి. ఇలాంటి పరిస్థితులు ఉండబట్టే చైనా శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పని కానిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రోవర్‌కి దూరంగా కొండలు, ఇసుక, మట్టి, రాళ్లు, దిబ్బలు తప్ప ఏమీ కనిపించట్లేదని తెలిసింది.
    Published by:Krishna Kumar N
    First published: