• Home
 • »
 • News
 • »
 • technology
 • »
 • CHINA MARS CHINA SUCCESSFULLY LANDS ZHURONG ROVER ON MARS HERE IS THE FULL DETAILS OF THIS PROJECT NK

China - Mars: మార్స్‌పై దిగిన చైనా రోవర్... అక్కడ కాలనీ నిర్మిస్తుందా?

మార్స్‌పై దిగిన చైనా రోవర్ (image credit - twitter - CNN)

China - Mars: అంగారక గ్రహంపై చైనా ఎప్పుడో కన్నేసింది. ఇప్పుడు రోవర్‌ని దించింది. భవిష్యత్తులో అక్కడ కాలనీ నిర్మించి... అంతరిక్షంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని చూస్తోంది. చైనా ప్లాన్ ఏంటో చూద్దాం.

 • Share this:
  Mars Rover Zhurong: అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో తానూ పోటీగా ఉన్నానని చెబుతోంది చైనా. వచ్చే ఏడాదికల్లా సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్ దేశం... అంగారక గ్రహం (Mars)పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. తాజాగా అక్కడ ఝురోంగ్ అనే రోవర్‌ని విజయవంతంగా దింపింది. ఇదో చరిత్ర అనుకోవచ్చు. ఎందుకంటే... ఎక్కడో 32 కోట్ల కిలోమీటర్ల అవతల ఉంది మార్స్. అక్కడి గతుకుల నేలపై అత్యంత జాగ్రత్తగా ఓ రోవర్‌ని దింపడం మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు. మన ఇస్రో ఇలాంటి ప్రయత్నం చేసి ఫెయిలైన విషయం మనకు తెలుసు. అంతరిక్ష పరిశోధనల్లో ఇండియా కంటే వెనకబడి ఉన్న చైనా... ఇప్పుడు దూసుకొచ్చింది అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే... అమెరికా తర్వాత... మార్స్‌పై రోవర్‌ని దించిన రెండో దేశంగా చైనా నిలిచింది. అంతకంటే ఆ దేశానికి ఇంకేం కావాలి?

  చైనా అధికారిక మీడియా ఈ విషయం చెప్పింది. శనివారం ఉదయం (ఇవాళే).. మార్స్ పై ఉన్న సున్నితమైన వాతావరణంలో... ఓ విశాల మైదానంలో... రోవర్‌ను సురక్షితంగా దింపినట్లు చైనా మీడియా తెలిపింది. ఇక నాసా లాగే... చైనా కూడా... మార్స్‌పై మట్టి ఎలా ఉంది, అందులో ఏ ఖనిజాలు ఉన్నాయి... అక్కడి కొండలు, గుట్టలు అన్నింటినీ అత్యంత దగ్గర నుంచి రోవర్ ద్వారా పరిశీలించగలదు.

  చైనా గత నెల్లో... తన సొంత అంతరిక్ష కేంద్రం కోసం... కోర్ మాడ్యూల్‌ని రోదసిలో రిలీజ్ చేసింది. అలాగే... గత డిసెంబర్‌లో చందమామ నుంచి 2 కేజీల రాళ్లను చైనా భూమికి తెప్పించుకుంది. వచ్చే నెలలో చైనా... ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపబోతోంది. ఇలా చైనా అన్ని రకాలుగా అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో దూసుకుపోతోంది.
  తాజా రోవర్ విజయంతో... చైనా... అంతరిక్ష ప్రయోగాల్లో తానూ పోటీగా ఉన్నానని నిరూపించుకున్నట్లైంది. ఇన్నాళ్లూ తమకు తిరుగులేదు అనిపించుకుంటున్న నాసాకు... చైనా గట్టి పోటీ ఇవ్వడం మొదలైంది అనుకోవచ్చు. ఈ విషయంపై నాసాకి చెందిన అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ సైన్స్ థామస్ జుర్బుచెన్ స్పందించారు. చైనాకి శుభాకాంక్షలు తెలిపిన ఆయన... కలిసి ముందుకు సాగుదాం అన్నారు. రెడ్ ప్లానెట్‌ను మరింతగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అన్నారు.


  చైనా మార్స్ మిషన్ ఇదీ:
  గత జులైలో చైనా... తియాన్వెన్-1 (Tianwen-1) మిషన్‌ను మార్స్ కి పంపింది. అందులో ఓ ఆర్బిటర్, ఓ ల్యాండర్, ఓ రోవర్ ఉన్నాయి. ఫిబ్రవరి 10న ఈ మిషన్... మార్స్ వాతావరణంలోకి చేరింది. ఆ తర్వాత గుండ్రంగా తిరుగుతూ దిగే టైమ్ కోసం ఎదురుచూసింది. రోవర్ పేరు ఝురోంగ్. చైనా జనపదాల్లో అగ్నిని ఝురోంగ్ అనేవారు. అదే పేరును దానికి పెట్టింది. ఈ ఝురోంగ్ రోవర్... 240 కేజీల బరువు ఉంది. ఇది సోలార్ పవర్ ఉపయోగించుకొని మార్స్‌పై తిరగగలదు. దీనికి కెమెరాలు, రాడార్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్, వెదర్ స్టేషన్ వంటివి ఉన్నాయి.

  ఇది కూడా చదవండి: Immunity boost: వెల్లుల్లి, చింతపండు రసంతో ఫుల్ ఇమ్యూనిటీ... ఇలా తయారుచేసుకోండి

  చైనా పదేళ్ల కిందటే ఇలాంటి ప్రయోగం చేసి ఫెయిలైంది. అందులో చైనా తప్పేమీ లేదు. రోవర్‌ని తీసుకెళ్లిన రష్యా రాకెట్... పేలిపోయింది. మార్స్ ఉత్తరాన ఉన్న మంచును పరిశీలించేందుకు చైనా ఈ రోవర్‌ని పంపింది.
  Published by:Krishna Kumar N
  First published: