Home /News /technology /

CHINA HAS BUILT AN ARTIFICIAL MOON ON EARTH THAT SIMULATES LOW GRAVITY CONDITIONS HERE DETAILS NS GH

China Builds Artificial Moon: చైనా మరో అద్భుత సృష్టి.. ఏకంగా భూమిపైనే మరో చంద్రుడి నిర్మాణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అంతరిక్ష విజ్ఞానంలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్న చైనా(China), భూమిపై కృత్రిమ చంద్రుడిని నిర్మించింది. ఈ చంద్రుడు తక్కువ గురుత్వాకర్షణ పరిస్థితులను అనుకరిస్తుంది. ఈ తరహా చంద్రుడి సృష్టి జరగడం ఇదే మొదటిసారి.

చంద్రుడు ఆకాశంలో ఉంటాడు. కాని అంతరిక్ష విజ్ఞానంలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్న చైనా, భూమిపై కృత్రిమ చంద్రుడిని నిర్మించింది. ఈ చంద్రుడు తక్కువ గురుత్వాకర్షణ పరిస్థితులను అనుకరిస్తుంది. ఈ తరహా చంద్రుడి సృష్టి జరగడం ఇదే మొదటిసారి. భవిష్యత్‌లో చంద్రుడిపై చైనా తలపెట్టే ప్రయోగాల్లో ఈ ఆవిష్కరణ కీలక భూమిక పోషించనుంది. రానున్న నెలల్లో అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చైనా యూనివర్సిటీ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్త లి రుయిలిన్ తెలిపారు. ఈ కృత్రిమ చంద్రుడి ప్రాజెక్టును తూర్పు నగరం జుఝోలో చేపటనున్నారు. ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారని అని లి వివరించారు. చంద్రుడిని అనుకరణను ఇది పూర్తిగా కొత్త స్థాయిలోకి తీసుకెళ్తుందని, గురుత్వాకర్షణ శక్తి మాయమైపోతుందని, అది ఎంత కాలం కావాలంటే అంత కాలం ఉంచవచ్చని అన్నారు. ఒక వ్యాక్యూమ్‌ ఛాంబర్‌లో 60 సెంటిమీటర్ల (దాదాపు రెండు అడుగులు) డయామీటర్‌తో కూడిన ఈ మిని మూన్‌ ఏర్పాటు చేశారు. చంద్రుడిపై కనిపించే తరహాలోనే ఈ కృత్రిమ చంద్రుడిని రాళ్లు, ధూళితో రూపొందించారు.

ఈ ల్యాండ్‌స్కేప్‌కు చంద్రుడి తరహాలో ఆయస్కాంత క్షేత్రం ఆధారంగా ఉంటుంది. అందులో గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఉండే మాదిరిగానే ఆరవ వంతు ఉంటుంది. ఆ క్షేత్రం ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ తేలికపాటి వస్తువులు, కప్ప లేదా ఛెస్ట్‌నట్‌ వంటివి గాల్లోకి ఎగురుతూ ఉంటాయి. చంద్రుడిపై చైనా చేపట్టబోయే ప్రయోగాల్లో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించగలదని లీ అభిప్రాయపడ్డారు. పరికరాలను పరీక్షించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన లెక్కల్లో తప్పులు దొర్లకుండా ఇది శాస్త్రవేత్తలకు సాయపడుతుందని అన్నారు. “ఇంప్యాక్ట్‌ టెస్ట్‌ వంటి ప్రయోగాలకు కేవలం కొన్ని సెకన్లు (సిమ్యూలేటర్‌లో) మాత్రమే కావాలి. కాని నెమ్మదిగా సాకే కొన్ని రకాల ఇతర పరీక్షలకు రోజులు తరబడి సమయం పడుతుంది” అన్నారు లీ.
China: కరోనా అని అనుమానం వస్తే పెట్టేలో పెట్టేయడమే.. చైనాలో కఠిన చర్యలు

చంద్రుడిపై నీటి ఆనవాళ్ల పరిశీలన..
చంద్రుడిపై 3D ప్రింటింగ్ పనిచేస్తుందా అని పరీక్షించేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చని తెలిపారు. అంతే కాదు చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటు చేస్తే మనుగడ సాగించవచ్చా అని తెలుసుకునేందుకు కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. కృత్రిమ వాతావరణంలో నిర్వహించే కొన్ని ప్రయోగాల ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయని వివరించారు. ఉపరితలపై నీరు ఎక్కడ ఉందో అన్వేషించేందుకు దోహదపడగలదని తెలిపారు.
Indian Army Chief: చైనాతో యుద్ధం వస్తే భారత్‌దే గెలుపు.. ఆర్మీ ఛీఫ్ తాజా ప్రకటన..

ఈ సదుపాయం ఏర్పాటు చేసేందుకు ఎన్నో రకాల సాంకేతిక ఆవిష్కరణలు అవసరమయ్యాయని లీ వెల్లడించారు. చంద్రుడిలో ఉండే తరహా వాతావరణం సృష్టించేందుకు ఏర్పాటు చేసిన అయస్కాంత శక్తులు ఎంత బలమైనవి అంటే సూపర్‌ కండక్టింగ్‌ వైర్లను అవి విచ్ఛిన్నం చేయడంతో పాటు అనేక లోహ పరికరాలను పనికిరాకుండా చేశాయని వివరించారు. అయస్కాంతంతో కప్పను గాల్లోకి లేపిన ఆండ్రి గెయిన్ ప్రయోగాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ కేంద్రాన్ని రూపొందించామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు ఇది అందుబాటులో ఉంటుందని లీ తెలిపారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: China, Moon

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు