హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oppo, OnePlus: ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లు బ్యాన్..! చైనా మొబైల్స్‌పై సంచలన నిర్ణయం..!!

Oppo, OnePlus: ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లు బ్యాన్..! చైనా మొబైల్స్‌పై సంచలన నిర్ణయం..!!

ఒప్పో, వన్ ప్లస్ మొబైల్స్‌ని బ్యాన్ చేసిన జర్మనీ

ఒప్పో, వన్ ప్లస్ మొబైల్స్‌ని బ్యాన్ చేసిన జర్మనీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో (Oppo), వన్‌ప్లస్ (OnePlus)కి ఒక జర్మనీ కోర్టు (Germany Court) భారీ షాక్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీల స్మార్ట్‌ఫోన్లను దేశంలో బ్యాన్ (Ban) చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో (Oppo), వన్‌ప్లస్ (OnePlus)కి ఒక జర్మనీ కోర్టు (Germany Court) భారీ షాక్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీల స్మార్ట్‌ఫోన్లను దేశంలో బ్యాన్ (Ban) చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. దాంతో ఇకపై జర్మనీలో ఒప్పో, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండవు. ఇటీవల ఒప్పో, వన్‌ప్లస్‌ కంపెనీలు నోకియా పేటెంటెడ్ టెక్నాలజీ (Nokia Patented Technology)కి సంబంధించి ఒక వివాదంలో చిక్కుకున్నాయి. ఈ పేటెంటెడ్ టెక్నాలజీ విషయంలోనే జర్మనీలోని మ్యాన్‌హీమ్ రీజినల్ కోర్టు ఒప్పో, వన్‌ప్లస్‌ ఫోన్స్ బ్యాన్ చేసింది. ఈ వివాదంలో కోర్టు నోకియాకు అనుకూలంగా తీర్పునిచ్చిందని Nokiamob.netలోని ఒక రిపోర్టు వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల నోకియా పేటెంట్ పొందిన టెక్నాలజీని నోకియా లైసెన్సులు లేకుండానే ఒప్పో తన డివైజ్‌ల్లో ఉపయోగించింది. ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోకుండా ఒప్పో తన పేటెంటెడ్ టెక్నాలజీని అలా ఎలా ఉపయోగిస్తుందని నోకియా కంపెనీ ఆగ్రహించింది. ఆ తర్వాత 2021లో యూకే, ఫ్రాన్స్, జర్మనీతో సహా ఆసియాలోని ఇండియా, యూరప్‌లోని నాలుగు దేశాలలో ఒప్పోపై దావా (Lawsuit) వేసింది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీల మొబైల్స్‌పై కోర్టు విధించిన బ్యాన్ పర్మనెంట్ బ్యాన్ కాదు. కాకపోతే నోకియా యూరోపియన్ పేటెంట్ EP 17 04 731 ఉల్లంఘించినందుకు ఒప్పో, వన్‌ప్లస్ ఇకపై జర్మనీలో తమ డివైజ్‌లను విక్రయించలేవు. ఈ పేటెంట్ వివాదంలో ఒప్పోపై నోకియా ఇప్పుడు మొదటి విజయాన్ని సాధించింది. కానీ అసలు ఈ వివాదం ఏంటి, దావా దేనికి సంబంధించినది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇదీ చదవండి: అయ్యబాబోయ్.. దేశంలో మహిళలు ఎక్కువగా తాగే రాష్ట్రాలు ఏంటో తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !


* నోకియా, ఒప్పో న్యాయ పోరాటం

మ్యాన్‌హీమ్‌లోని జర్మన్ కోర్టు నోకియా 4G/5G పేటెంట్ వివాదంలో ఒప్పో, దాని అనుబంధ సంస్థ వన్‌ప్లస్‌కి వ్యతిరేకంగా... నోకియా కంపెనీకి సపోర్ట్‌గా తీర్పు ఇచ్చింది. కొన్ని నెలల క్రితం నోకియా, ఒప్పో బ్రాండ్‌ల మధ్య 4G (LTE), 5G కనెక్టివిటీ పేటెంట్‌ విషయంలో తగాదాలు వచ్చాయి. ఇదే విషయమై రెండు కంపెనీల మధ్య సుదీర్ఘమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు తన తీర్పు వెలువరించింది. నోకియా ఒప్పోపై 9 స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు (SEPS), ఐదు ఇంప్లిమెంటేషన్ పేటెంట్లపై మూడు రీజినల్ జర్మన్ కోర్టులలో దావా వేసింది. వాస్తవానికి నోకియా దాదాపు 129 బిలియన్ యూరోల భారీ పెట్టుబడితో 5G SEPS (Standard Essential Patents) విభాగంలో నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు, ఈ రంగంలో అనేక పేటెంట్‌లను నోకియా సొంతం చేసుకుంది. ఇవన్నీ గత కొన్ని ఏళ్లలోనే అనేక సెటిల్‌మెంట్లను సైతం పొందాయి.

అయితే ఈ వివాదాస్పద పేటెంట్‌లకు సంబంధించి జర్మన్ రీజినల్ కోర్టు ఇచ్చిన తీర్పే మొదటి తీర్పు. ఈ న్యాయస్థానం ఒప్పోకి వ్యతిరేకంగా పేటెంట్‌ టెక్నాలజీని వాడుకోకుండా విరమణ (Cease-and-desist) ఆర్డర్‌ను నోకియాకు మంజూరు చేసింది. దాంతో ఒప్పో, వన్‌ప్లస్ ఇకపై తమ ఫోన్స్ విక్రయించడానికి వీలు లేకుండా పోయింది. నోకియా మే 2017లో యాపిల్ సంస్థపై కూడా ఒక దావా వేసింది. అప్పుడు నోకియా పేటెంట్‌లను ఉల్లంఘించినందుకు సెటిల్‌మెంట్‌లో భాగంగా యాపిల్ నోకియాకి 2 బిలియన్లు డాలర్లు చెల్లించింది.

First published:

Tags: China, Germany, ONE PLUS, Oppo

ఉత్తమ కథలు