హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp security: వాట్సాప్‌ సెక్యూరిటీ కోసం ముచ్చటగా మూడు సూత్రాలు...

WhatsApp security: వాట్సాప్‌ సెక్యూరిటీ కోసం ముచ్చటగా మూడు సూత్రాలు...

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

వాట్సాప్‌ భద్రత విషయంలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. దీని కోసం ఏదో అదనంగా టూల్స్‌, సాఫ్ట్‌వేర్‌లు ఏవీ కొనక్కర్లేదు, ప్రత్యేకంగా ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. వాట్సాప్‌లోనే ఇన్‌బిల్ట్‌గా కొన్ని ఫీచర్లు ఉంటాయి. వాటిని యాక్టివేట్‌ చేసుకొని మీ వాట్సాప్‌ను సెక్యూర్డ్‌గా వాడుకోవచ్చు. ఆ ఆప్షన్లు ఏవో చూద్దాం!

ఇంకా చదవండి ...

వ్యక్తిగత, వృత్తిగత జీవితం మొత్తం ఇప్పుడు వాట్సాప్‌తో ముడిపడి ఉంది. పనులు, మాటలు, ఫొటోలు, వీడియోలు అన్నీ అందులోనే ఉంటున్నాయి. అంతటి ముఖ్యమైన వాట్సాప్‌ భద్రత విషయంలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. దీని కోసం ఏదో అదనంగా టూల్స్‌, సాఫ్ట్‌వేర్‌లు ఏవీ కొనక్కర్లేదు, ప్రత్యేకంగా ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. వాట్సాప్‌లోనే ఇన్‌బిల్ట్‌గా కొన్ని ఫీచర్లు ఉంటాయి. వాటిని యాక్టివేట్‌ చేసుకొని మీ వాట్సాప్‌ను సెక్యూర్డ్‌గా వాడుకోవచ్చు. ఆ ఆప్షన్లు ఏవో చూద్దాం!

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ...

వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అప్‌డేట్‌ చేస్తూ ఉంటుంది. మరోవైపు సెక్యూరిటీ పరంగా ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే, వస్తాయని తెలిస్తే... ఆ అప్‌డేట్‌లో దానికి తగ్గ మార్పులు చేస్తుంది. అందుకే వాట్సాప్‌ను తరచూ అప్‌డేట్‌ చేసుకోవడం మంచింది. రోజూ అప్‌డేట్‌ వస్తోంది.. కొత్తగా చూస్తే ఏం కనిపించదు, ఎందుకు అప్‌డేట్‌ చేయాలి అనే ఆలోచన వద్దు.

టూ స్టెప్‌ వెరిఫికేషన్‌

రక్షణ కోసం వాట్సాప్‌ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ అనే ఓ సదుపాయాన్ని ఆ మధ్య తీసుకొచ్చింది. అంటే వాట్సాప్‌ అప్పుడప్పుడు యూజర్లకు ఓ ఆరెంకల పాస్‌వర్డ్‌ను అడుగుతుంటుంది. అదిస్తేనే యాప్‌ను వాడొచ్చు. వాడేది... ఒరిజినల్‌ యూజరేనా అనేది తెలుసుకోవడానికే ఈ ఏర్పాటు. అయితే దీనిని మీరే యాక్టివేట్‌ చేసుకోవాలి. దీని కోసం వాట్సాప్‌ యాప్‌లోని టాప్‌లో ఉన్న మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేయండి. అందులో Accountలోకి వెళ్లాలి. అక్కడ Two-step Verification అని ఉంటుంది. దానిని Enable చేసుకోవాలి. అప్పుడు ఆరెంకల పిన్‌ అడుగుతుంది. ఆ తర్వాత ఈమెయిల్‌ అడుగుతుంది. ఆ రెండూ ఇస్తే టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ పెట్టేసుకున్నట్లే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ పిన్‌ అడుగుతుంది. అది ఎంటర్‌చేసి వాట్సాప్‌ వాడుకోవచ్చు.

బయో మెట్రిక్‌ లాక్‌

ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ లేని ఫోన్లు ఈ మధ్య కాలంలో తక్కువే అని చెప్పాలి. ఈ ఆప్షన్‌ను కూడా వాడుకొని వాట్సాప్‌కు రక్షణ కల్పించుకోవచ్చు. ఒకవేళ ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ లేకపోతే, ఫేస్‌ఐడీ అయినా వాడుకోవచ్చు. దీని కోసం వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో అకౌంట్‌లోకి వెళ్తే... అందులో ప్రైవసీ ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో చూస్తే ఆఖరున ఫింగర్‌ ప్రింట్‌/ ఫేస్‌ ఐడీ లాక్‌ అని ఉంటుంది. ఆ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే... ఇక మీ వాట్సాప్‌లో బయోమెట్రిక్‌ లాక్‌ పెట్టినట్లే. ఇంకెందుకు ఆలస్యం ఈ మూడు సూత్రాలు పాటించండి. వాట్సాప్‌ను సెక్యూర్‌గా ఉంచుకోండి.



ఇది క్లిక్ చేసి చూడండి



ఇది క్లిక్ చేసి చూడండి

First published:

Tags: Whatsapp

ఉత్తమ కథలు