Aadhar Card: మీ ఆధార్ కార్డుతో ఇత‌రులు సిమ్ వాడితే ఏం చేయాలి.. తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

మ‌న ఆధార్( Aadhaar) నంబ‌ర్‌పై ఎన్నిసిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌దే.. అయితే అది ఎలా అనుకుంటున్నారా.. అయితే తెలుసుకోండి. అంతేకాకుండా ఇతరులు మన ఆధార్ కార్డుతో సిమ్ వాడితే ఏం చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    ప్ర‌స్తుతం రోజు రోజుకు సైబ‌ర్ నేరాలు(Cyber Crime) పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న ఆధార్ కార్డు స‌మాచారం ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంచుకోవాలి. ఎవ‌రు ప‌డితే వారు వాడ‌కుండా మ‌న ఆధార్‌కార్డును మ‌న‌మే కాపాడుకోవాలి. ప్ర‌స్తుతం సిమ్(SIM) కార్డు తీసుకోవాలంటే క‌చ్చితంగా ఆధార్‌కార్డు ఇవ్వాల్సిందే. ఈ నేప‌థ్యంలో మ‌న ఆధార్ కార్డుతో ఎవ‌రైనా సిమ్ తీసుకొంటే ఎలా.. మ‌న‌కు ఆ విష‌యం తెలియ‌కుంటే ఆ సిమ్‌ను దుర్వినియోగం చేస్తే మ‌నం స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌న ఆధార్ నంబ‌ర్‌పై ఎన్నిసిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌దే.. అయితే అది ఎలా అనుకుంటున్నారా అయితే తెలుసుకోండి. ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డ్స్ లింక్ అయి ఉన్నాయో… రిజిస్ట‌ర్ అయి ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక వెబ్ సైట్ ఉంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్స్(డీవోటీ) ఇటీవ‌ల ఒక వెబ్ పోర్ట‌ల్‌ను లాంచ్ చేసింది. టెలికామ్(Telecom) అన‌లిటిక్స్, ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్జ్యూమ‌ర్ ప్రొటెక్ష‌న్(టీఏఎఫ్‌కాప్‌) పేరుతో ఈ పోర్ట‌ల్ నిర్వ‌హిస్తున్నారు.

    ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకొనే విధానం
    - మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవ‌డానికి https://tafcop.dgtelecom.gov.in/ అనే వెబ్ సైట్‌ను ఓపెన్ చేయాలి.
    - అక్క‌డ మీ ఆధార్‌తో లింక్ అయి ఉన్న నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి.
    - ఆ త‌ర్వాత క‌న్ఫ‌ర్మేష‌న్‌ రిక్వెస్ట్ ఓటీపీ బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి.
    - అప్పుడు మీ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది.
    - దాన్ని వెరిఫై చేయాలి. అనంత‌రం మ‌రోపేజీ ఓపెన్ అవుతుంది.
    - అక్క‌డ ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబ‌ర్స్ క‌నిపిస్తాయి.
    - ఒక్క ఆధార్ కార్డు ద్వారా 9 సిమ్ కార్డ్స్ తీసుకోవ‌చ్చు.

    Realme 8s 5G: మార్కెట్‌లోకి రియ‌ల్‌మి 8ఎస్‌.. బెస్ట్ ఆఫ‌ర్స్ ఇవే


    తెలుసుకున్న త‌రువాత ఏం చేయాలి..
    - మీకు క‌నిపించిన నంబ‌ర్‌లు మీరు వాడితున్నారో లేదో చూసుకోండి.
    - ఒక‌వేళ మీరు ఆ నెంబ‌ర్‌ను వాడ‌క‌పోయినా.. ఏదైనా నెంబ‌ర్ అనుమానాస్ప‌దంగా ఉన్నా.. వెంట‌నే ఆ నెంబ‌ర్ మీద సెలెక్ట్ చేసి రిపోర్ట్ చేయొచ్చు.
    - రిపోర్టుకు డు ఆప్ష‌న్లు ఉంటాయి.
    - 1. This is not my, 2. Not required, 3. require ఈ మూడు ఆప్ష‌న్లలో ఏదో ఒక‌టి సెలెక్ట్ చేసి.. రిపోర్ట్ అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయండి.

    ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కిల్ క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. మిగితా రాష్ట్రాల క‌స్ట‌మ‌ర్ల‌కు త్వ‌ర‌లోనే ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని డీవోటీ వెల్ల‌డించింది.
    Published by:Sharath Chandra
    First published: