Smart Phones: ఆగస్టు​లో విడుదలైన బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లు..​ తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. వివరాలివే!

అగస్టులో విడుదలైన బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

ఆగస్టు నెలలో గూగుల్, రియల్‌మీ, రెడ్‌మి, టెక్నో, మోటరోలా వంటి అనేక ప్రముఖ బ్రాండ్ల నుంచి ఫోన్లు రిలీజ్​ అయ్యాయి.

  • Share this:
స్మార్ట్ ఫోన్ (Smart Phones) లవర్స్​ కోసం అనేక కంపెనీలు వరుసగా స్మార్ట్​ఫోన్లను విడుదల చేశాయి. ఆగస్టు నెలలో గూగుల్ (Google), రియల్‌మీ (Ream Me), రెడ్‌మి (Redmi), టెక్నో, మోటరోలా (Motorola) వంటి అనేక ప్రముఖ బ్రాండ్ల నుంచి ఫోన్లు రిలీజ్​ అయ్యాయి. దీంతో ఈ నెల మొత్తం మొబైల్​ మార్కెట్​లో హడావుడి కనిపించింది. ఆయా బ్రాండ్ల నుంచి విడుదలైన స్మార్ట్​ఫోన్లు, వాటి ఫీచర్లను పరిశీలిద్దాం.

పిక్సెల్ 5ఎ (Pixel 5A)


గూగుల్ తన పిక్సెల్ 5ఎ స్మార్ట్​ఫోన్​ను ఆగస్టు 17న ప్రకటించింది. ఇది 6.34 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. 5G ఎనేబుల్ స్మార్ట్‌ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటివి అందించింది. 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ షూటర్‌ కెమెరాలతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా చేర్చింది. ఎక్సెల్​ 5ఎ 4680 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

రియల్‌మీ జీటీ (ReamMe GT)


రియల్‌మీ జీటీ 6.43 అంగుళాల సూపర్ AMOLED డిస్​ప్లేతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 బేస్డ్ రియల్‌మి యుఐ 2.0 పై నడుస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 888 5 జి సోసి ద్వారా పనిచేస్తుంది. రియల్​మీ జీటీ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇది 8 బీజీ ర్యామ్​, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్​, 12 జీబీ ర్యామ్​, 256 ఇంటర్నల్​ స్టోరేజ్ వంటివి అందించింది. కెమెరా విషయానికి వస్తే.. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌ కెమెరాను చేర్చింది. దీని ముందు భాగంలో 16 మెగాపిక్సెల్​ కెమెరాను చేర్చింది. స్టీరియో స్పీకర్లు, బ్లూటూత్ 5.2, అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, టైప్–సి 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్లను అందించింది. రియల్​మీ జీటీ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 20 (Motorola Edge 20)


మోటరోలా ఎడ్జ్ 20 ఆగస్టు 16న విడుదలైంది. ఇది 6.4 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11పై నడుస్తుంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్‌, 8 GB ర్యామ్, 256 GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను అందించింది. మోటరోలా ఎడ్జ్ 20 లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. ఇందులో బ్లూటూత్ 5.2, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్​బీ టైప్-సి 2.0 వంటివి చేర్చింది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000 mAh బ్యాటరీని చేర్చింది.

రెడ్‌మి 10 (Redmi 10)


రెడ్​మి10 స్మార్ట్‌ఫోన్‌ ఆగస్టు 20 న విడుదలైంది, ఇది 6.5 -అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 పై నడుస్తుంది. ఇది మీడియాటెక్​ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Redmi 10 మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM + 64GB స్టోరేజ్, 4GB RAM + 128GB స్టోరేజ్, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లలో లబిస్తుంది. ఇందులో క్వాడ్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించింది. దీనిలో బ్లూటూత్ 5.1, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్​బి టైప్-సి 2.0 వంటివి చేర్చింది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 9W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ (Reamme GT Master Edition)


రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ 6.43 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G 5G SoC ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ UI 2.0పై నడుస్తుంది. దీనిలో 8 GB ర్యామ్​, 128 GB స్టోరేజ్, 8 GB ర్యామ్​, 256 GB స్టోరేజ్​తో వస్తుంది. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాను అందించింది. ఇందులో బ్లూటూత్ 5.2, అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, USB టైప్-సి 2.0 వంటివి చేర్చింది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4300 mAh బ్యాటరీతో వస్తుంది.

టెక్నో పోవా 2 (Technopova 2)


టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ 6.80 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో విడుదలైంది. ఇది మీడియా టెక్​ హీలియో జీ85 ఎస్​ఓసీ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 4 GB ర్యామ్​, 64 GB ఇంటర్నల్​ స్టోరేజ్​ 6 GB ర్యామ్​,128 GB స్టోరేజ్​తో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు ప్రైమరీ 48 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలను చేర్చింది. టెక్నో పోవా 2 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 7000 mAh బ్యాటరీతో వస్తుంది.

IPL 2021: వీళ్లు బ్యాటుతో రాణిస్తే.. ఆ జట్టు విజయానికి తిరుగుండదు.. ఎవరా బ్యాట్స్‌మెన్?



Published by:John Naveen Kora
First published: