OnePlus Buds: వన్​ప్లస్ నుంచి అతి తక్కువ ధరలోనే రానున్న ఇయర్ బడ్స్.. లీకైన ఫీచర్ల వివరాలివే!

one plus buds

వన్​ప్లస్​ ఆశ్చర్యకరంగా ఒకే రకమైన ఫీచర్లు గల ప్రొడక్ట్స్​ను వేర్వేరు ధరల వద్ద మార్కెట్​లో విక్రయిస్తోంది. ఉదాహరణకు, వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ సిఈ 5 జి ఒకే రకమైన స్పెసిఫికేషన్లతో విడుదలయ్యాయి. కానీ, వీటి మధ్య ధరల వ్యత్యాసం అధికంగా ఉంది.

  • Share this:
OnePlus Buds: స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో దూసుకుపోతున్న వన్‌ప్లస్ ఇప్పుడు ఇయర్​ బడ్స్​ మార్కెట్​పై దృష్టిసారించింది. ఈ సంస్థ వరుసగా ఇయర్​బడ్స్​ విడుదల చేస్తూ యూజర్లను పెంచుకుంటోంది. తాజాగా అతి తక్కువ ధరలో మరో ఇయర్ బడ్స్‌ను సంస్థ రూపొందిస్తోంది. వీటిని బడ్స్​ లైట్​ లేదా బడ్స్​ 2 పేరుతో లాంచ్​ చేసే అవకాశం ఉంది. భారత మార్కెట్​లో లో కాస్ట్​, మిడ్​ రేంజ్​ ప్రొడక్ట్స్​కు అధిక డిమాండ్​ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలోనే ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేయాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఫీచర్లలో ఎక్కడా రాజీపడకుండా దీన్ని రూపొందిస్తోంది. ఈ టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్‌లో యూక్టివ్​ నాయిస్​ క్యాన్సలేషన్​ (ఏఎన్​సీ) ఫీచర్‌ని అందించనుంది. (OnePlus Buds Nord Blue)

Samsung Galaxy A52s 5G: సాంసంగ్ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర ఎంతంటే

వీటి ధర.. వన్‌ప్లస్ బడ్స్, వన్‌ప్లస్ బడ్స్ ప్రో మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వీటిలో వన్‌ప్లస్ బడ్స్ ప్రోతో సమానమైన ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ప్రో మోడల్​లో మాదిరిగానే ఎక్స్‌ట్రీమ్, ఫైన్ట్, స్మార్ట్ మోడ్​లతో ఇది రూపొందనుంది. క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్​, బ్లూటూత్ v5.2, IPX4 వాటర్ రెసిస్టెన్స్, 38 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఛార్జింగ్ కేస్​, డాల్బీ అట్మాస్ సపోర్ట్​తో 11mm డైనమిక్ డ్రైవర్లు, 94 మిల్లీసెకన్ల లేటెన్సీ వంటి ఫీచర్లను అందించనుంది.

ఇప్పటికే వన్​ప్లస్ నుంచి రూ.4,990 ధరతో రెగ్యులర్​ బడ్స్, రూ. 9,990 ధరతో బడ్స్ ప్రో అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు రూ. 2,999 ధరతో వన్‌ప్లస్ బడ్స్ Zని కంపెనీ విక్రయిస్తుంది. ఈ మూడింటికి భారత మార్కెట్​లో అనూహ్యమైన స్పందన లభిస్తోంది. యాపిల్​ బడ్స్​ను తలదన్నేలా అద్భుతమైన ఫీచర్లతో సరసమైన ధరలోనే వీటిని లాంచ్​ చేయడం విశేషం.

VPN BAN: వీపీఎన్ బ్యాన్ అవుతుందా..? వీపీఎన్ అంటే ఏమిటి

రూ.5 వేలలోపు అద్భుతమైన ఫీచర్లు..
వన్​ప్లస్​ ఆశ్చర్యకరంగా ఒకే రకమైన ఫీచర్లు గల ప్రొడక్ట్స్​ను వేర్వేరు ధరల వద్ద మార్కెట్​లో విక్రయిస్తోంది. ఉదాహరణకు, వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ సిఈ 5 జి ఒకే రకమైన స్పెసిఫికేషన్లతో విడుదలయ్యాయి. కానీ, వీటి మధ్య ధరల వ్యత్యాసం అధికంగా ఉంది. కాబట్టి, వన్‌ప్లస్ బడ్స్ లైట్ లేదా బడ్స్ 2 కూడా ఇదే తరహాలో అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరలో విడుదల చేయడంలో ఆశ్చర్యం లేదని టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ఈ సరికొత్త ఇయర్‌బడ్స్​ ఒప్పో ఎన్‌కో డబ్ల్యూ 51, రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2కు గట్టి పోటీనివ్వనున్నాయి. భారతదేశంలో ఇవి రూ. 5,000 కంటే తక్కువ ధరలోనే విడుదల కానున్నాయి. అయితే ఈ ఇయర్​ బడ్స్​ గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది. వీటిపై సంస్థ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.
Published by:Krishna Adithya
First published: