ChatGPT: ఓపెన్ ఏఐ (OpenAI) పరిచయం చేసిన చాట్‌జీపీటీ (ChatGPT) అత్యంత అధునాతన ఫీచర్లతో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతోంది. అయితే ఈ ఏఐ చాట్‌బాట్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం చాలానే ఉంది. ముఖ్యంగా దీని లిమిటెడ్ డేటాసెట్ అనేది మారాలి. ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తూ అప్-టు-డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తే దీనికిదే పోటీ అవుతుంది. అందుకే ఈ దిశగా ఓపెన్ ఏఐ సంస్థ అడుగులు వేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా OpenAI అధికారికంగా ChatGPT కోసం కొన్ని ప్లగిన్‌లను లాంచ్ చేసింది. ఒక ప్లగిన్‌తో ఇంటర్నెట్ యాక్సెస్‌ను కూడా అందించింది. ఈ ప్లగిన్స్‌తో చాట్‌జీపీటీ ద్వారా క్షణాల్లోనే ఎన్నో విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. అనేక పనులను ఈజీగా పూర్తి చేయవచ్చు.
చాట్‌జీపీటీ ఇప్పుడు ఎంచుకున్న థర్డ్-పార్టీ డేటాబేస్‌లు, సమాచార మూలాలను కూడా యాక్సెస్ చేయగలదు. ఇది ఎంచుకున్న వెబ్‌సైట్‌లతో ఇంటరాక్ట్ అవుతూ సమాచారాన్ని సేకరించగలదు. ప్రస్తుతానికి, వివిధ కంపెనీలు అభివృద్ధి చేసిన 11 ప్లగిన్లను ChatGPT కోసం OpenAI విడుదల చేసింది. వీటిలో Slack, Zapier, Expedia, FiscalNote, Instacart, Milo, OpenTable వంటి ప్రముఖ కంపెనీల ప్లగిన్లు ఉన్నాయి.
ఈ ప్లగిన్‌ల ద్వారా వినియోగదారులు ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించి అపారమైన రియల్-టైమ్ సమాచారాన్ని చిటికెలో పొందవచ్చు. అప్-టు-డేట్ ఇన్ఫర్మేషన్‌తో ట్రిప్‌లను ప్లాన్ చేసుకోవచ్చు. బెస్ట్ రెస్టారెంట్స్ గురించి రికమండేషన్స్ అందుకోవచ్చు. ఓపెన్ టేబుల్ ప్లగిన్‌తో రెస్టారెంట్ బుకింగ్స్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టాకార్ట్ ప్లగిన్‌తో ప్రొడక్ట్స్ షాపింగ్ చేయవచ్చు. స్థానిక కిరాణా దుకాణాల నుంచి కావలసిన వాటిని చాట్‌బాట్ నుంచే ఆర్డర్ చేయవచ్చు. ఇష్టపడే రెసిపీలను వెతికి, చాట్‌బాట్ నుంచే నేరుగా వాటిని ఆర్డర్ చేయవచ్చు. పైథాన్‌ని ఉపయోగించే ఇంటర్‌ప్రెటింగ్ కోడ్స్‌తో అప్‌లోడ్‌లు, డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. ఫైల్ ఫార్మాట్‌లను మార్చవచ్చు. ఇంకా ఎన్నో పనులను చేసుకోవచ్చు. స్లాక్, జాపియర్‌తో గూగుల్ షీట్స్, జీమెయిల్, Trello వంటి అప్లికేషన్‌లతో కనెక్ట్ కావచ్చు.
https://twitter.com/marckohlbrugge/status/1638961527775703040?t=Ni4wFWCfqQvXrS22Pr45cQ&s=19
ఓపెన్ ఏఐ ChatGPT కోసం వెబ్ బ్రౌజర్, కోడ్ ఇంటర్‌ప్రెటర్ అనే రెండు ప్లగిన్‌లను కూడా అభివృద్ధి చేసింది. వెబ్ బ్రౌజర్ ప్లగిన్ Bing AI APIని ఉపయోగించి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయడానికి, సమాచారాన్ని పొందడానికి చాట్‌జీపీటీకి వీలు కల్పిస్తుంది. 2021 వరకు మాత్రమే ప్రస్తుతానికి చాట్‌జీపీటీ ట్రైనింగ్ డేటా పరిమితం అయింది. అయితే వెబ్ బ్రౌజర్ ప్లగిన్‌ను చాట్‌జీపీటీ వినియోగిస్తూ ఇంటర్నెట్ సమాచారాన్ని సేకరించి లేటెస్ట్ ఈవెంట్స్‌కి సంబంధించిన డేటాను కూడా అందించగలదు. అంతేకాకుండా, వివిధ రకాల సోర్సుల నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా యూజర్‌లకు తెలియజేస్తుంది.
NPCI: యూపీఐ ద్వారా యాప్, మొబైల్ డేటా హ్యాక్ అయ్యే అవకాశమే లేదు.. NPCI ప్రకటన
* రిలీజ్ ఎప్పుడు?
పైన పేర్కొన్న ప్లగిన్‌లన్ని ప్రస్తుతం పరిమిత ఆల్ఫా టెస్టింగ్ దశలో మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ మందికే ఇవి రిలీజ్ అయ్యాయి. సైన్-అప్ చేయగల వెయిట్‌లిస్ట్ ద్వారా ChatGPT ప్లగిన్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. ముందు తక్కువ సంఖ్యలో డెవలపర్లు, ChatGPT ప్లస్ వినియోగదారులకు మాత్రమే ఇవి రిలీజ్ అవుతాయి. ఈ ప్లగిన్‌లతో చాట్‌జీపీటీ మరింత శక్తివంతంగా మారి, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఏఐ చాట్‌బాట్స్ అందుకోలేని రేంజ్‌కి వెళ్తుందని చెప్పవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Artificial intelligence, Chatgpt, Internet, Technology