అక్కడుంది విక్రమ్ ల్యాండర్... 2GB ఇమేజ్ రిలీజ్ చేసిన నాసా... మీరే చూడండి

Chandrayaan-2 : విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కనిపెట్టలేకపోయామని నాసా చెబితే... చాలా మంది నమ్మలేదు. నాసా కావాలనే అలా చెబుతోందనీ, నిజానికి విక్రమ్ ల్యాండర్‌ను నాసా కనిపెట్టే ఉంటుందని కొందరు విమర్శించారు. కానీ... నాసా రిలీజ్ చేసిన తాజా ఇమేజ్ ప్రకారం... విక్రమ్ ల్యాండర్ కనిపించే అవకాశాలే లేవని స్పష్టమవుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 29, 2019, 9:42 AM IST
అక్కడుంది విక్రమ్ ల్యాండర్... 2GB ఇమేజ్ రిలీజ్ చేసిన నాసా... మీరే చూడండి
ఈ ఫొటో ద్వారా విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో తెలుస్తోంది (Credit - NASA)
  • Share this:
ISRO Chandrayaan-2 : చంద్రయాన్-2‌లో భాగమైన విక్రమ్ ల్యాండర్... సెప్టెంబర్ 6న అర్థరాత్రి దాటాక... 1.40కి చంద్రుడి దక్షిణ ధ్రువంపై పడిపోయింది. ఐతే... అది ఎక్కడ పడింది? ఎలా ఉంది? తిన్నగా పడిందా? అడ్డుగా పడిందా? ఎందుకు పనిచెయ్యట్లేదు? ఎందుకు సిగ్నల్స్ అందుకోవట్లేదు? ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి. రెండ్రోజుల కిందట అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ- నాసా... విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అయ్యిందని తెలిపింది. అది పూర్తిగా సూర్యుడి ఎండ పడని ప్రదేశంలో పడిపోవడం వల్ల దాన్ని కనిపెట్టలేకపోతున్నామని అధికారికంగా వెల్లడించింది. నాసా అలా చెప్పినా... చాలా మందికి నమ్మశక్యం కాలేదు. ఎందుకంటే... నాసా దగ్గర అత్యంత పవర్‌ఫుల్ కెమెరాలున్నాయి. చంద్రుడిపై ప్రతీ రాయినీ చూడగలిగేంత పవర్ ఉంటుంది నాసా దగ్గరున్న కెమెరాలకు. అలాంటప్పుడు నాసాకి విక్రమ్ ల్యాండర్ ఎందుకు కనిపించలేదన్న ప్రశ్న ప్రజల్లో అలాగే ఉండిపోయింది. దానికి ఆన్సర్ ఇప్పుడు దొరికింది.

విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టేందుకు నాసా... ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్‌ (LRO)ను రంగంలోకి దింపిందని మనకు తెలుసు. రెండు పగులు లోయల మధ్యలోని మైదాన ప్రాంతంలో కూలిపోయిన ల్యాండర్‌ను కనిపెట్టేందుకు LRO సెప్టెంబర్ 17న ప్రయత్నించి విఫలమైంది. ఎందుకంటే... విక్రమ్ ల్యాండర్ చీకటి ప్రాంతంలో పడింది. నాసా అప్‌లోడ్ చేసిన మూడో ఫొటో మ్యాప్ ద్వారా ఆ విషయం మనకు అర్థమవుతుంది. అది ఎంత పెద్ద ఫొటో అంటే... 2GB ఉంది. ఇందులో పిక్సెల్‌కి 1.25 మీటర్ల రిజల్యూషన్ ఉంది. దాన్ని డౌన్‍‌లోడ్ చేసుకోవచ్చు. మనమే ఇంచు ఇంచు వెతకొచ్చు. బట్... విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిందో అందులో నాసా క్లియర్‌గా చెప్పింది. ఆ ప్రదేశంలో అంతా చీకటి తప్ప ఏమీ లేదు. అదే ఈ కింది ఫొటో.

chandrayaan 2,chandrayaan-2,chandrayaan 2 news,isro chandrayaan 2,chandrayaan 2 latest news,chandrayaan 2 live,chandrayaan 2 landing,chandrayaan 2 mission,chandrayaan2,isro chandrayaan 2 mission,vikram lander chandrayaan 2,chandrayaan 1,chandrayaan 2 moon,chandrayaan 2 lander,chandrayaan 2 moon landing,chandrayaan,chandrayaan 2 isro,chandrayaan 2 update,vikram lander,chandrayaan 2 orbiter,chandrayaan 2 updates,నాసా,ఇస్రో,చంద్రయాన్-2,విక్రమ్ ల్యాండర్,LRO,
ఈ ఫొటో ద్వారా విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో తెలుస్తోంది (Credit - NASA)


ఈ ఫొటోను మీరూ నాసా LRO వెబ్‌సైట్‌లో చూడొచ్చు. మీరూ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే... మీ సిస్టంలో 2జీబీ స్పేస్ ఖాళీ ఉండి తీరాలి. ఈ లింక్ (http://lroc.sese.asu.edu/posts/1128) క్లిక్ చేస్తే... ఇమేజ్ ఉన్న లొకేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడే ఫొటోనూ జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసి వెతకొచ్చు. లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ల్యాండర్ కూలిన చోట వెలుతురు లేదు కాబట్టి... అక్టోబర్‌లో మళ్లీ సూర్యకాంతి పడినప్పుడు... LRO ద్వారా వెతికిస్తామని ఇస్రో తన ప్రకటనలో తెలిపింది.
First published: September 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading