Chandrayaan-2 : విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కనిపెట్టలేకపోయాం : నాసా

Chandrayaan-2 : చంద్రుడి దక్షిణ ఉపరితలంపై హార్డ్ లాండింగ్ అయిన విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టలేకపోయినట్లు అధికారికంగా ప్రకటించింది నాసా. అత్యంత శక్తిమంతమైన కెమెరాలతో చూసినా... నాసా కనిపెట్టలేకపోవడం ఆశ్చర్యకరమే.

Krishna Kumar N | news18-telugu
Updated: September 27, 2019, 8:49 AM IST
Chandrayaan-2 : విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కనిపెట్టలేకపోయాం : నాసా
విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కనిపెట్టలేకపోయాం : నాసా (Credit - Twitter - NASA)
  • Share this:
ISRO Chandrayaan-2 : మనకు తెలుసు... చంద్రయాన్-2‌లో భాగమైన విక్రమ్ ల్యాండర్... సెప్టెంబర్ 6న అర్థరాత్రి దాటాక... 1.40కి చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిందని. ఐతే... అది సాఫ్ట్ ల్యాండింగ్ అయివుంటే... అది పనిచేయడమే కాక... ఎక్కడ దిగినదీ స్పష్టంగా తెలిసేది. హార్డ్ ల్యాండింగ్ అవ్వడం వల్ల అది ఎక్కడ పడిందో కూడా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా కనిపెట్టలేకపోయింది. నిజానికి 14 రోజులు పనిచేసే విక్రమ్‌కి శనివారంతో డెడ్‌లైన్ ముగిసింది. ఇప్పుడు దాన్ని కనిపెట్టినా ప్రయోజనం లేనట్లే. కాకపోతే... అది ఎలా కూలిందో, ఏ పొజిషన్‌లో ఉందో తెలుస్తుంది. విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టేందుకు నాసా... ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్‌ (LRO)ను రంగంలోకి దింపింది. రెండు పగులు లోయల మధ్యలోని మైదాన ప్రాంతంలో కూలిపోయిన ల్యాండర్‌ను కనిపెట్టేందుకు LRO సెప్టెంబర్ 17న ప్రయత్నించి విఫలమైంది.


ఐతే... విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రదేశంలో... ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అక్కడ నీడలు ఎక్కువగా పడుతున్నాయి. అందువల్ల కచ్చితంగా విక్రమ్ ఎక్కడుందో తెలియట్లేదని నాసా తెలిపింది. LRO పంపిన ఫొటోలను వారం పాటూ... పరిశీలించిన నాసా శాస్త్రవేత్తలు... వాటిలో విక్రమ్ ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. ప్రస్తుతం ల్యాండర్ కూలిన చోట వెలుతురు లేదు కాబట్టి... అక్టోబర్‌లో మళ్లీ సూర్యకాంతి పడినప్పుడు... LRO ద్వారా వెతికిస్తామని ఇస్రో తన ప్రకటనలో తెలిపింది.



విక్రమ్ ల్యాండర్ విషయంలో ఏం జరిగిందో విశ్లేషించేందుకు ఓ జాతీయ స్థాయి కమిటీని వేసినట్లు ఇస్రో ఛైర్మన్ కె.శివన్... గురువారం తెలిపారు. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా... భవిష్యత్ ప్లాన్ ఉంటున్నారు. ఇందుకోసం కొన్ని తప్పనిసరి అనుమతులు, ఇతర ప్రక్రియ ఉంటుందన్నారు. దీనిపై తాము దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ఇస్రో... గగన్‌యాన్ మిషన్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఎందుకంటే... వచ్చే ఏడాది గగన్‌యాన్ ద్వారా... ఇస్రో... ముగ్గురు భారతీయ వ్యోమగాములను రోదశిలోకి పంపబోతోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లు అవుతాయని అంచనా వేసుకుంది ఇస్రో.

 

ఇవి కూడా చదవండి :

Health Tips : డయాబెటిస్‌కి వేపతో చెక్... ఇలా చెయ్యండి

Health Tips : డయాబెటిస్ ఉందా... మీరు తినదగ్గ 10 బేక్‌ఫాస్ట్స్ తెలుసుకోండి


Health Tips : కొబ్బరి పాలతో హెయిర్ స్పా... ఇలా చెయ్యండి

Peanut Butter Fruit : ఈ ఫ్రూట్ విశేషాలు తెలుసా మీకు?
First published: September 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>