ISRO Moon : చందమామపై సముద్రం... చంద్రయాన్-2 పంపిన ఫొటోపై కొత్త చర్చ...

Chandrayaan 2 : చంద్రయాన్ 2 ఉపగ్రహం... చందమామను అతి దగ్గర నుంచీ తీసి పంపిన ఫొటో వైరల్ అవ్వడంలో వింతేమీ లేదు. ఐతే... ఆ ఫొటోలో... ఓ సముద్రానికి సంబంధించిన వివరాల్ని శాస్త్రవేత్తలు కనుక్కోవడం చర్చకు దారితీసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 23, 2019, 11:56 AM IST
ISRO Moon : చందమామపై సముద్రం... చంద్రయాన్-2 పంపిన ఫొటోపై కొత్త చర్చ...
చంద్రయాన్ 2 ఉపగ్రహం తీసిన చందమామ ఫొటో (Image:ISRO/Twitter)
  • Share this:
ISRO Moon : చంద్రయాన్ 2 ఉపగ్రహం... చంద్రుడి మొట్టమొదటి ఫొటోను పంపింది. దీన్ని ఇస్రో తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి... ప్రపంచానికి పరిచయం చేసింది. చంద్రుడి కక్ష్యలో సుమారు 2650 కిలోమీటర్ల దూరం నుంచి చందమామను ఫొటో తీసి పంపింది చంద్రయాన్ 2. ఆగస్ట్ 21న చంద్రయాన్ 2 ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్టు ఇస్రో తెలిపింది. ఇటీవలే ఇస్రో తన చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వచ్చే నెలలో చంద్రుడి మీద విక్రమ్ లాండర్‌ను దింపనుంది. అత్యంత క్లిష్టమైన ఈ దశను విజయవంతంగా పూర్తి చేస్తే అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇస్రో కొత్త చరిత్రను రాసినట్టు అవుతుంది. ఇదంతా సరే... కొత్త విషయమేంటంటే... చంద్రయాన్ 2 పంపిన ఫొటోపై ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే... ఈ ఫొటోలో... చందమామపై అపోలో పగులు లోయలతో పాటూ... ఓ చోట చందమామపై 380కోట్ల సంవత్సరాల కిందట సముద్రం ఉండేదట. దాన్నే "మేర్ ఓరియంటేల్" అంటున్నారు.


ఈ మేర్ ఓరియంటేల్ అనే పదానికి చిత్రమైన చరిత్రే ఉంది. శాస్త్రవేత్తలు ఒకప్పుడు... ఆ మేర్ ఓరియంటేల్ ప్రాంతాన్ని చూసి... అక్కడ సముద్రం ఉందని భావించేవాళ్లు. అందుకే దాన్ని మేర్ అన్నారు. మేర్ అంటే... లాటిన్ భాషలో సముద్రం అని అర్థం.
చందమామపై మేర్ ఓరియంటేల్ (File - Image from NASA)


చందమామపై నల్లగా ఉండే ఆ ప్రదేశాలు... బసాల్ట్ కలిగిన మైదానాలు. అవి... అగ్నిపర్వతాలు బద్ధలైనప్పుడు ఏర్పడ్డాయి. అవి మిగతా ప్రదేశాల కంటే నల్లగా ఉన్నాయి. ఎందుకంటే... అక్కడ భారీగా ఐరన్ నిల్వలు ఉండటమే. ఐతే... ఇవన్నీ... 300 కోట్ల సంవత్సరాల కిందట... చిన్నపాటి సముద్రాలలాగా ఉండేవి. అలాంటి ఓ సముద్రమే... మేర్ ఓరియంటేల్.

చందమామపై మేర్ ఓరియంటేల్ (File - Image from NASA)


చందమామపై దాదాపు 40 సముద్రాలు ఉండేవట. వాటిలో మేర్ ఓరియంటేల్ మాత్రం... అలలు లేకుండా ఉండేది. ఎందుకంటే... బసాల్ట్ నిల్వలే. ఐతే... మేర్ ఓరియంటేల్‌కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. అదేంటంటే... ఇది చందమామపై తాజా పగులు లోయ. అంటే... చందమామను చివరిసారి గ్రహశకలాలు ఢీకొట్టినప్పుడు ఏర్పడినదే ఈ లోయ. ఇది మొత్తం 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. చూడ్డానికి ఇది ఎద్దు కన్నులా కనిపిస్తుంది. దీనిపై మూడు చోట్ల రింగ్స్ లాంటి ఆకారాలు ఉన్నాయి.
Published by: Krishna Kumar N
First published: August 23, 2019, 11:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading