Chandrayaan 2 | చంద్రుడిపై విక్రమ్ దిగిన తర్వాత ఏం జరుగుతుంది?

రోవర్ ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై ఒక రోజంతా ఉంటుంది. చంద్రుడిపై ఒక రోజు భూమిపై 14 రోజులకు సమానం. అలా 14 రోజుల పాటు రోవర్ తన పరిశోధనలు, ప్రయోగాలను నిర్వహిస్తుంది రోవర్.

news18-telugu
Updated: September 7, 2019, 1:20 AM IST
Chandrayaan 2 | చంద్రుడిపై విక్రమ్ దిగిన తర్వాత ఏం జరుగుతుంది?
రోవర్ ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై ఒక రోజంతా ఉంటుంది. చంద్రుడిపై ఒక రోజు భూమిపై 14 రోజులకు సమానం. అలా 14 రోజుల పాటు రోవర్ తన పరిశోధనలు, ప్రయోగాలను నిర్వహిస్తుంది రోవర్.
news18-telugu
Updated: September 7, 2019, 1:20 AM IST
చంద్రయాన్ 2 వ్యోమనౌక మరి కాసేపట్లో చంద్రుడిపై అడుగు పెట్టనుంది. అర్ధరాత్రి 1.40 నుంచి 1.55 మధ్య చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలోని మాంజినస్-సీ, సింపెలియస్-ఎన్ అనే రెండు అగ్ని పర్వతాల మధ్యలో ఉన్న ఎత్తైన ప్రాంతంలో ల్యాండర్ విక్రమ దిగుతుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ఇప్పటి వరకు ఏ వ్యోమనౌక కూడా ల్యాండ్ కాలేదు. ప్రపంచంలోనే భారత్ తొలిసారిగా ఆ ప్రయత్నం చేస్తుంది. చంద్రుడిపై ల్యాండర్ దిగే ఆ 15 నిమిషాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఎందుకంటే ల్యాండర్ వేగం తగ్గించుకుంటూ కిందకు దిగాల్సి ఉంటుంది. 6120 కి.మీ వేగం నుంచి సున్నా వేగానికి చేరుకొని అనంతరం చంద్రుడిపై దిగుతుంది.

ఇక విక్రమ్ ల్యాండర్ దిగిన 3 గంటల తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తుంది. అంటే ఉదయం 04.30 నుంచి 05.30 మధ్య విక్రమ్ నుంచి బయటకు వచ్చే అవకాశముంది. సోలార్ ప్యానెల్స్ తెరచుకున్న తర్వాతే రోవర్ అది బయటకు వస్తుంది. ల్యాండర్ విక్రమ్ నుంచి ప్రజ్ఞాన్ గరిష్ఠంగా 500 మీ దూరం మాత్రమే వెళ్తుంది. దానిపై సౌరఫలకాల ద్వారా బ్యాటరీలు రీచార్జ్ అవుతాయి. రోవర్ ముందు భాగంలో రెండు నేవిగేషన్ కెమెరాలు ఉంటాయి. వాటి ద్వారా చంద్రుడిపై ఉన్న వాతావరణాన్ని ఫొటోలు తీసి ల్యాండర్ విక్రమ్‌కి పంపుతుంది. అక్కడి నుంచి ఇస్రోకు చేరుకుంటాయి.

ప్రజ్ఞాన్ రోవర్‌కు ఆరు చక్రాలుంటాయి. ఎడమ వైపు ఉన్న చక్రాల్లో ఒక దానికి అశోక చక్రం ఉంటుంది. ల్యాండర్‌ ర్యాంప్‌పై భారత జాతీయ జెండా ఉంటుంది. రోవర్ కుడి వైపున ఉన్న చక్రాల్లో ఒకదానికి ఇస్రో లోగో ఉంటుంది. అంటే రోవర్ ముందుకు కదితే చంద్రుడిపై ఉన్న మట్టిలో అశోక చక్రం, ఇస్రో లోగో అచ్చులు కనిపిస్తాయి. మనం భూమిపై నడిస్తే కాళ్ల అచ్చులు ఎలాగైతే పడతాయో..అలా పడతాయన్న మాట..! ఇక చంద్రుడిపై రాళ్లు రప్పలు ఉన్నా వాటి మీద నుంచి వెళ్లేలా రోవర్‌ని డిజైన్ చేశారు. అంతేకాదు ఎలాంటి వాతావరణ పరిస్థితులున్నా తట్టుకునేలా రూపొందించారు. ఇక నేవిగేషన్ కెమెరాల ద్వారా చంద్రుడి ఉపరితలంపై ఉన్న వాతావరణ పరిస్థితులను ప్రజ్ఞాన్ అంచనా వేసి విక్రమ్‌కు, అక్కడి నుంచి ఇస్రోకు సమాచారం చేరవేస్తుంది.




రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై ఒక రోజంతా ఉంటుంది. చంద్రుడిపై ఒక రోజు భూమిపై 14 రోజులకు సమానం. అలా 14 రోజుల పాటు తన పరిశోధనలు, ప్రయోగాలను నిర్వహిస్తుంది రోవర్. కాగా, ఆర్బిటార్ మిషన్ మాత్రం మరో సంవత్సరం పాటు కొనసాగుతుంది. చంద్రుడిపై ఇప్పటి దాకా అమెరికా, చైనా, రష్యా మాత్రమే వ్యోమనౌకలను సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. ఇప్పుడు విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంత ఆ నాలుగు దేశాల సరసన భారత్ కూడా చేరుతుంది. ఐతే దక్షిణ ధృవంలో దిగిన తొలిదేశంగా భారత్ చరిత్రకెక్కుతుంది.










First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...