Chandrayaan 2 | మీ ఫొటోని మోదీ రీ ట్వీట్ చేయాలంటే.. ఇలా చేయండి..

Chandrayaan 2 | చంద్రయాన్ 2ను సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలతో కలసి వీక్షించనున్నారు.

news18-telugu
Updated: September 6, 2019, 11:13 PM IST
Chandrayaan 2 | మీ ఫొటోని మోదీ రీ ట్వీట్ చేయాలంటే.. ఇలా చేయండి..
నరేంద్ర మోదీ, చంద్రయాన్ 2
news18-telugu
Updated: September 6, 2019, 11:13 PM IST
చంద్రయాన్ 2 ప్రయోగంలో అద్భుత దశకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి (తెల్లవారితే శనివారం) 1.30 గంటల నుంచి 2.30 మధ్య సాఫ్ట్ ల్యాండింగ్ జరగనుంది. ఇస్రో ఎంతో ఉద్విగ్నంగా ఈ క్షణాల కోసం ఎదరుచూస్తోంది. ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం ఆ మధురక్షణాల కోసం వెయిట్ చేస్తోంది. అయితే, జీవితంలో ఒక్కసారి వచ్చే ఇలాంటి అద్భుత క్షణాలను మీరు కూడా చూడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చంద్రయాన్ 2 ప్రయోగం కోసం తాను ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నానని మోదీ చెప్పారు. ప్రజలు కూడా చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షించాలని, ఆ సందర్భంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే తాను కొన్నింటిని ట్వీట్ చేస్తానని ప్రధాని మోదీ చెప్పారు.





చంద్రయాన్ 2ను సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలతో కలసి వీక్షించనున్నారు. చంద్రయాన్ 2 గురించి మైగవర్న‌మెంట్ వెబ్‌సైట్‌లో సంధించిన క్విజ్‌కు సరైన జవాబులు చెప్పిన విద్యార్థులతో కలసి ఆయన ఇస్రోలో చంద్రయాన్ 2 సాఫ్ట్ ‌ల్యాండింగ్ ప్రయోగాన్ని వీక్షించనున్నారు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...