Chandrayaan 2| ఆఖరి క్షణాల్లో అంతరాయం.. విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్ కట్

ఎంత వెయిట్ చేసినా ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్ అందకపోవడంతో శాస్త్రవేత్తల ముఖాల్లో అప్పటి వరకు ఉన్న ఆనందం ఆవిరైపోయింది. ఇస్రో ఛైర్మన్ శివన్.. ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో వివరించారు. అనంతరం మోదీ ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి వెళ్లిపోయారు.

news18-telugu
Updated: September 7, 2019, 4:11 AM IST
Chandrayaan 2| ఆఖరి క్షణాల్లో అంతరాయం.. విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్ కట్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 7, 2019, 4:11 AM IST
Chandrayaan 2 | ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో అంతరాయం కలిగింది. అన్ని అవరోధాలను దాటుకుంటూ ముందుకెళ్లిన విక్రమ్ ల్యాండర్‌కి ఆఖరి క్షణాల్లో సమస్య తలెత్తింది. చంద్రునికి అతి సమీపంలోకి వెళ్లిన తర్వాత ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్ కట్ అయింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. దూరంలో ఉన్న సమయంలో ఈ అంతరాయం కలిగింది. దాంతో బెంగళూరులోని ఇస్రో కేంద్రకార్యాలయంలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఎంత వెయిట్ చేసినా ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్ అందకపోవడంతో శాస్త్రవేత్తల ముఖాల్లో అప్పటి వరకు ఉన్న ఆనందం  ఆవిరైపోయింది. ఇస్రో ఛైర్మన్ శివన్.. ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో వివరించారు. అనంతరం మోదీ ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి వెళ్లిపోయారు.

చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు విక్రమ్ ల్యాండర్ ప్రయాణం సజావుగా సాగిందని ఇస్రో ఛైర్మన్ కే.శివన్ తెలిపారు. ఆ తర్వాత ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు కమ్యూనికేషన్ కోల్పోయినట్లు ఆయన  ప్రకటించారు. దీనిపై విశ్లేషిస్తున్నామన్నారు శివన్.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...