Chandrayaan-2 : చంద్రయాన్-2కి ఏర్పాట్లు పూర్తి... నేడు షార్‌కి ఇస్రో ఛైర్మన్...

ISRO Chandrayaan-2 : ఇండియాతోపాటూ ప్రపంచమంతా ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-2ని ఆసక్తిగా చూస్తోంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 13, 2019, 6:33 AM IST
Chandrayaan-2 : చంద్రయాన్-2కి ఏర్పాట్లు పూర్తి... నేడు షార్‌కి ఇస్రో ఛైర్మన్...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: July 13, 2019, 6:33 AM IST
ISRO Chandrayaan-2 : ఒకప్పుడు చందమామపై నీటి జాడలు ఉన్నాయని చంద్రయాన్-1 ఉపగ్రహం ద్వారా కనిపెట్టిన ఇస్రో... ఇప్పుడు చందమామ దక్షిణ ధ్రువంపై ఫోకస్ పెడుతూ... చంద్రయాన్-2 ప్రయోగాన్ని జులై 15న చేపట్టబోతోంది. ఆ రోజు తెల్లవారు జామున 2.51 గంటలకు... నెల్లూరు జిల్లాలోని... శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ సంస్థలోని రెండో ప్రయోగ వేదిక నుంచీ చంద్రయాన్-2 శాటిలైట్‌ని పంపబోతోంది. GSLV-Mark 3M 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం జరగబోతోంది. ఇప్పటికే ఓసారి రిహార్సల్ 100 శాతం సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. మరోసారి కూడా రిహార్సల్ చెయ్యాలని నిర్ణయించారు. ఆ తర్వాత కౌంట్‌డౌన్ ప్రకటిస్తారు. ఇందుకోసం ఇవాళ ఇస్రో ఛైర్మన్ కె.శివన్ ఇవాళ షార్‌కి రాబోతున్నారు.


ఈ మిషన్ ద్వారా ఇస్రో... ఓ ఆర్బిటర్, రోవర్, ల్యాండర్‌ను చందమామపైకి పంపబోతోంది. ఆర్బిటర్‌లో రోవర్, ల్యాండర్‌ను అమర్చి... అది చందమామ కక్ష్యా మార్గంలోకి చేరిన వెంటనే... రోవర్... రెక్కలు తెరచుకుని... ల్యాండర్ సాయంతో... చందమామ దక్షిణ ధ్రువానికి చేరుతుంది. 15న యాత్ర మొదలుపెట్టి... ఐదు రోజుల తర్వాత... భూ నియంత్రిత చంద్రుడి కక్ష్యలోకి వస్తుంది. ఆ తర్వాత... 16 రోజుల పాటూ... కక్ష్యామార్గాన్ని వివిధ దశల్లో సెట్ చేస్తారు. ఆ తర్వాత 27 రోజుల పాటూ చందమామ చుట్టూ తిరుగుతుంది. ఆ టైంలో ఆర్బిటర్ నుంచీ విడిపోయే ల్యాండర్ చందమామవైపు పయనించి... సెప్టెంబర్ 6 లేదా 7న చందమామ దక్షిణ ధ్రువంపై వాలుతుంది. సోలార్ పవర్‌తో పనిచేస్తూ... పరిశోధనలు చేస్తుంది.




ఐదేళ్లుగా చేపడుతున్న చంద్రయాన్-2 ప్రయోగానికి రూ.978 కోట్లు ఖర్చయ్యాయి. పూర్తి ఇండియా టెక్నాలజీతోనే చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని తయారుచేశారు. ఈ ప్రయోగాన్ని చూసేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... 14న సాయంత్రం 4.30కు షార్‌కి రాబోతున్నారు. రాత్రి అక్కడే ఉండి, 15న నక్షత్ర అతిథిగృహం నుంచీ 2.30 గంటలకు మిషన్ కంట్రోల్ సెంటర్‌కి చేరి, అక్కడి నుంచీ చంద్రయాన్-2 ప్రయోగాన్ని చూస్తారు.


ఈ ప్రయోగం ద్వారా భారత్... అమెరికా, రష్యా, చైనాల తర్వాత చంద్రుడిపైకి వ్యోమనౌకను, రోవర్‌ను పంపిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించబోతోంది. ఈ ప్రయోగంలో ప్రజ్ఞాన్ అనే రోవర్... 14 రోజుల పాటూ చందమామ దక్షిణ ధ్రువంపై దాదాపు 500 మీటర్లు తిరుగుతుంది. అది చంద్రుడి కీలక సమాచారాన్ని ఇస్రోకి చేరవేస్తుంది.
First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...