జూలై 15న చంద్రయాన్ 2.. టైమ్, ప్లేస్.. డిటెయిల్స్..

జూలై 15న 2.51 గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం జరపనున్నట్టు ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు.

news18-telugu
Updated: June 12, 2019, 4:52 PM IST
జూలై 15న చంద్రయాన్ 2.. టైమ్, ప్లేస్.. డిటెయిల్స్..
చంద్రయాన్ 2 మిషన్
  • Share this:
భారత కీర్తికిరీటంలో మణిహారం వంటి చంద్రయాన్ 2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. 2019 జూలై 15న ప్రయోగం చేపట్టాలని ఇస్రో చైర్మన్ డా. కె.శివన్ ప్రకటించారు. చంద్రుడిపై రహస్యాలను శోధించి మరోసారి భారత జెండాను రెపరెపలాడించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రెడీ అయింది. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు, అక్కడి ఖనిజ వనరులు, నీరు, ఇంధన నిల్వలను విశ్లేషించేందుకు చంద్రయాన్-2ను చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. 2019, జూలై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా మూడు పరికరాలు.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లు ఉంటాయన్నారు. చంద్రయాన్-2 వ్యవస్థ మొత్తం బరువు 3,447 కేజీలు కాగా, వీటిలో ఒక్క ప్రొపెల్లర్ బరువే ఏకంగా 1,179 కేజీలు ఉంటుందని చెప్పారు. ఓసారి ఉపగ్రహాన్ని ప్రయోగించాక, ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. 2019 సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని వెల్లడించారు. చంద్ర‌యాన్‌-2 ప్రాజెక్టు ఖ‌రీదు రూ.603 కోట్లు అని ఇస్రో చైర్మ‌న్ చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కోసం దశాబ్దాలుగా భారత శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. ఈ ప్రయోగం తర్వాత లభించే సమాచారం ఆధారంగా ఐస్రో తదుపరి తన వ్యూహాలను అమలు చేయనుంది.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>