Chandrayaan 2 Launch Live | అసలు చంద్రుడే లేని గ్రహాలు ఏవో తెలుసా?

Live ISRO Chandrayaan-2 | భూ గ్రహానికి ఒక చంద్రుడు ఉన్నాడు. అంగారక గ్రహానికి ఇద్దరు చంద్రులు ఉన్నారు. నెప్ట్యూన్‌కి 14 చంద్రులు ఉన్నారు.

news18-telugu
Updated: July 22, 2019, 3:29 PM IST
Chandrayaan 2 Launch Live | అసలు చంద్రుడే లేని గ్రహాలు ఏవో తెలుసా?
చంద్రుడు
  • Share this:
ప్రస్తుతం దేశం మొత్తం చంద్రయాన్ గురించే ఆలోచిస్తోంది. చంద్రుడి మీద భారత్ ప్రయోగిస్తున్న రెండో రాకెట్ గురించి దేశంతోపాటు ప్రపంచంలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రాలన్నీ చర్చించుకుంటున్నాయి. అయితే, అసలు చంద్రుడే లేని గ్రహాలు కూడా ఉన్నాయి తెలుసా. మన సౌర వ్యవస్థలో ఉన్న ఎనిమిది గ్రహాల్లో గ్రహాల్లో అత్యధికంగా బృహస్పతికి, అత్యల్పంగా భూమికి చంద్రులు ఉపగ్రహాలుగా ఉన్నారు. భూ గ్రహానికి ఒక చంద్రుడు ఉన్నాడు. అంగారక గ్రహానికి ఇద్దరు చంద్రులు ఉన్నారు. నెప్ట్యూన్‌కి 14 చంద్రులు ఉన్నారు. యురేనస్‌కి 27 మంది చంద్రులు. శని గ్రహానికి 53 మంది చంద్రులు, బృహస్పతికి 79 మంది చంద్రులు ఉన్నారు. అయితే, బుధ గ్రహానికి, శుక్ర గ్రహానికి అసలు చంద్రులే లేరు. భూమ్మీద ఉన్న మనం.. చంద్రుడిని చూసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు చంద్రుడి మీద పరిశోధనలు కూడా చేస్తున్నాం. పాపం, బుధ గ్రహం, శుక్ర గ్రహాల్లో ఉండే వారికి (ఉంటే) చంద్రుడి మీద పాటలు రాసుకునే అవకాశం కానీ, చంద్రుడిని చూపించి పిల్లలకు గోరుముద్దలు తినిపించే అవకాశం కానీ లేదు పాపం.





First published: July 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading