ISRO Chandrayaan-2 | చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్.. మేరా ఇస్రో మహాన్.. భారత్ కొత్త చరిత్ర

Live ISRO Chandrayaan-2 | ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, జపాన్ మాత్రమే ఇలాంటి ఘనతను సాధించాయి. ఈ ఘనత సాధించిన ఐదో దేశంగా భారత్ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోనుంది.

news18-telugu
Updated: July 22, 2019, 3:29 PM IST
ISRO Chandrayaan-2 |  చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్.. మేరా ఇస్రో మహాన్.. భారత్ కొత్త చరిత్ర
చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం
news18-telugu
Updated: July 22, 2019, 3:29 PM IST
అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ కొత్త చరిత్రను సృష్టించింది. గగనతల పరిశోధనలో కొత్త రికార్డును నెలకొల్పింది. చంద్రయాన్ 2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా సాగింది. దేశం మొత్తం ఎదురుచూసిన ఈరోజు వచ్చింది. జూలై 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 2 ఉపగ్రహం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్‌ఎల్వీ మార్క్ 3 ఎం 1 వాహకనౌక ద్వారా చంద్రయాన్ 2 శాటిలైట్‌ను ప్రయోగించారు. సుమారు 50 రోజుల తర్వాత సెప్టెంబర్ 12- 13 తేదీల్లో చంద్రుడిపై అడుగుపెడుతుంది. చంద్రయాన్ 2 మూడు భాగాలుగా ఉంటుంది. రోవర్, లాండర్, ఆర్బిటర్. దీని మొత్తం బరువు 3,447 కేజీలు. ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు సుమారు రూ.960 కోట్లు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన శాటిలైట్ కావడం దీని ప్రత్యేకత.

చంద్రుడి మీద దక్షిణ ధ్రువంలో దిగే మొదటి ఉపగ్రహం ఇదే. చంద్రయాన్ 2లో మూడు భాగాలు ఉంటాయి. ఆర్బిటర్. లాండర్ (పేరు విక్రమ్), రోవర్ (పేరు ప్రజ్ఞాన్). ఆర్బిటర్ ఏడాది పాటు పనిచేస్తుంది. చంద్రుడి మీద దిగే లాండర్ (ప్రముఖ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్‌ స్మృతిలో దీనికి విక్రమ్ అని పేరు పెట్టారు.) 14 రోజులు సేవలు అందిస్తుంది. రోవర్ ప్రజ్ఞాన్ అది దిగిన ప్రదేశం నుంచి 500 మీటర్ల దూరం ప్రయాణం చేయగలుగుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, జపాన్ మాత్రమే ఇలాంటి ఘనతను సాధించాయి. ఈ ఘనత సాధించిన ఐదో దేశంగా భారత్ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోనుంది. చంద్రయాన్ 2 ప్రాజెక్టుకు మిషన్ డైరెక్టర్ (రీతు కథిరాల్) , ప్రాజెక్టు డైరెక్టర్‌ ( ఎం. వనిత)గా ఇద్దరూ మహిళలే ఉండడం విశేషం.

వాస్తవానికి ఈనెల 15వ తేదీనే చంద్రయాన్ 2 ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే, క్రయోజనిక్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్ల అది నిలిచపోయింది. 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు జరగాల్సిన ప్రయోగానికి 56 నిమిషాల 24 సెకన్లకు ముందు కౌంట్ డౌన్ నిలిచిపోయింది. ఆ తర్వాత సాంకేతిక సమస్యలను ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు సరిచేశారు. ఆ తర్వాత చంద్రయాన్ 2 ప్రయోగానికి కొత్త డేట్‌ను ప్రకటించారు.




Loading...
First published: July 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...