Chandrayaan 2 | రేపే చంద్రయాన్ 2 ప్రయోగం

Chandrayaan 2 | సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం జరగనుంది.

news18-telugu
Updated: July 21, 2019, 10:53 PM IST
Chandrayaan 2 | రేపే చంద్రయాన్ 2 ప్రయోగం
చంద్రయాన్ 2 ప్రయోగం (Image:ISRO)
  • Share this:
చంద్రయాన్ 2 ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం 6.43 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో జీఎస్ఎల్వీ మార్క్ 2 ఎం1 వాహకనౌకకు కౌంట్ డౌన్ మొదలైంది. 20 గంటల తర్వాత సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. వాస్తవానికి ఈనెల 15వ తేదీ తెల్లవారుఝామున 2.51 గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే, సాంకేతిక కారణాలతో ప్రయోగానికి 56 నిమిషాల ముందు కౌంట్‌డౌన్ నిలిచిపోయింది. ఆ తర్వాత మరోసారి షెడ్యూల్‌ను ఇస్రో ప్రకటించింది. దీనికి కౌంట్ డౌన్ కూడా మొదలైంది.

ఇవీ ప్రాజెక్టు ప్రత్యేకతలు :
- ఈ రాకెట్ ప్రయోగంలో మూడు దశలు ఉన్నాయి. రాకెట్ ప్రయోగించిన 16 నిమిషాల 13 సెకండ్లకు... భూమి నుంచీ 181.6 కిలోమీటర్ల ఎత్తులో... చంద్రయాన్-2 ఉపగ్రహం, విక్రమ్ ల్యాండర్‌ ఉన్న పేలోడ్ రాకెట్ నుంచీ బయటకు వస్తుంది. అక్కడితో రాకెట్ పని పూర్తయినట్లు లెక్క.

- ఈ పేలోడ్ భూ నియంత్రిత కక్ష్యా మార్గంలోకి చేరుతుంది. ఆ తర్వాత అది 17 రోజుల పాటూ రోదసిలో తిరుగుతూ... చందమామ దగ్గర్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మరో 6 రోజులు అలాగే తిప్పుతారు. ఆ తర్వాత చంద్రయాన్-2ని పేలోడ్ నుంచీ బయటకు తెస్తారు. అది 28 రోజులపాటూ చందమామ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా అది చందమామ కక్ష్యా మార్గంలోకి చేరుతుంది.
- చంద్రయాన్-2 ప్రయోగం జరిగిన 50 రోజుల తర్వాత పేలోడ్ నుంచీ విక్రమ్ ల్యాండర్ బయటకు వస్తుంది. 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధన చేయనుంది.



First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...