Chandrayaan 2 Lanuch Live | సాంకేతిక కారణాలతో చంద్రయాన్ 2 ప్రయోగం వాయిదా..

Chandrayaan 2 Launch Live | చంద్రయాన్ 2 ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ కొన్ని నిమిషాలకు ముందు నిలిచిపోయింది.

news18-telugu
Updated: July 15, 2019, 3:44 AM IST
Chandrayaan 2 Lanuch Live | సాంకేతిక కారణాలతో చంద్రయాన్ 2 ప్రయోగం వాయిదా..
శ్రీహరికోటలో 56 నిమిషాల ముందు నిలిచిపోయిన కౌంట్ డౌన్
news18-telugu
Updated: July 15, 2019, 3:44 AM IST
చంద్రయాన్ 2 ప్రయోగం వాయిదా పడింది. 130 కోట్ల మంది ఎదురుచూసిన సమయానికి 56.24 నిమిషాల ముందు కౌంట్ డౌన్ నిలిచిపోయింది. 19 గంటల 4 నిమిషాల పాటు కొనసాగిన తర్వాత కౌంట్ డౌన్ నిలిచిపోయింది. 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం జరగాల్సి ఉంది. అందుకు కౌంట్ డౌన్ కూడా కొనసాగింది. అయితే.. ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు కౌంట్ డౌన్‌ను నిలిపివేశారు. సాంకేతిక కారణాల వల్ల కౌంట్ డౌన్‌ను నిలిపివేసినట్టు ఇస్రో ప్రకటించింది.అయితే, ఆ సాంకేతిక కారణాలు ఏంటనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఎప్పుడు జరుపుతామో మరోసారి కొత్త డేట్‌ను ప్రకటిస్తామని ఇస్రో ప్రకటించింది.





ఇస్రో పౌర సంబంధాల అధికారి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సాంకేతిక కారణాల వల్ల ప్రయోగం ఈ రోజుకు వాయిదా పడిందని, త్వరలో మరో తేదీని ప్రకటిస్తామన్నారు.



చంద్రయాన్ ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరికోటకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు కూడా వచ్చారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా చాలా మంది ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు శ్రీహరికోటకు తరలివచ్చారు. 2.51 గంటలకు నింగిలోకి దూసుకెళ్లాల్సిన రాకెట్‌కు సంబంధించిన కౌంట్ డౌన్ నిలిచిపోవడంతో అక్కడున్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ప్రయోగానికి సంబంధించి ఇస్రో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. ప్రయోగం మరో గంటలో జరుగుతుందనే సమాచారాన్ని కూడా ట్విట్టర్ ద్వారా పంచుకుంది. కానీ, మధ్యలో కౌంట్‌డౌన్ నిలిచిపోయింది.



చంద్రయాన్ 2లో క్రయోజనిక్ ఇంజిన్‌లో సాంకతిక సమస్య తలెత్తింది. ఇంధనాన్ని నింపే క్రమంలో సమస్య ఎదురైంది. శాటిలైట్‌ను దాని కక్ష్యలోకి తీసుకుని వెళ్లగలిగేది ఈ ఇంధనమే. అందుకే, దీని విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని ఇస్రో భావించింది. అందుకే ప్రయోగాన్ని వాయిదా వేసింది.

మరోవైపు జూన్ 14న ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ.. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే.. మరో పది నిమిషాల్లో లాంచ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. (అనుకున్న ప్రకారం 2.51కి లాంఛ్ అవ్వాలి. అయితే, 3.01లోపు ఎప్పుడైనా లాంఛ్ చేసుకునే అవకాశం). అయితే, ఈ రోజు ప్రయోగం జరపడం లేదంటూ ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
First published: July 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...