Chandrayaan 2 | చంద్రయాన్ 2 ప్రయోగం ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడొచ్చు..

Misson Moon | జూలై 15న తెల్లవారుఝామున 2.51 గంటలకు చంద్రయాన్ 2 శాటిలైట్ నింగిలోకి దూసుకెళుతుంది.

news18-telugu
Updated: July 14, 2019, 5:57 PM IST
Chandrayaan 2 | చంద్రయాన్ 2 ప్రయోగం ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడొచ్చు..
శ్రీహరికోటలో ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్వీ మాక్ 3 (Image:ISRO/Twitter)
news18-telugu
Updated: July 14, 2019, 5:57 PM IST
చంద్రయాన్ 2 ప్రయోగం కోసం ఒక్క భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. జూలై 15న తెల్లవారుఝామున 2.51 గంటలకు చంద్రయాన్ 2 శాటిలైట్ నింగిలోకి దూసుకెళుతుంది. సుమారు 50 రోజుల తర్వాత సెప్టెంబర్ 6- 7 తేదీల్లో చంద్రుడిపై అడుగుపెడుతుంది. చంద్రయాన్ 2 మూడు భాగాలుగా ఉంటుంది. రోవర్, లాండర్, ఆర్బిటర్. దీని మొత్తం బరువు 3,447 కేజీలు. జీఎస్‌ఎల్వీ ఎంకే 3 వాహకనౌక ద్వారా దీన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 2009లో చంద్రయాన్ 1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు సుమారు రూ.850 కోట్లు.

చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీరు చూడొచ్చు.
చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని ఇస్రో కల్పించింది. అయితే, దీనికి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ సమయం ముగిసిపోయింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్రో కార్యాలయం నుంచి ప్రయోగాన్ని చూసే అవకాశాన్ని కల్పించారు.

ఆన్‌లైన్‌లో చంద్రయాన్ 2 ప్రయోగం చూడడం ఎలా?
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) స్వయంగా ఆన్‌లైన్‌లో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. @isro ట్విట్టర్, ఇస్రో ఫేస్ బుక్ అకౌంట్లో లైవ్ చూడొచ్చు. యూట్యూబ్‌లో దూరదర్శన్ లైవ్ కూడా చూడొచ్చు.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...