Chandrayaan 2 | చంద్రయాన్ 2 పై విదేశీ మీడియా అభినందనలు, సెటైర్లు, అక్కసు..

Moon mission | పాశ్చాత్యదేశాల మీడియాతో పాటు, అక్కడి సైంటిఫిక్ జర్నల్స్ దీనిపై ప్రత్యేక కథనాలను ప్రచురిస్తున్నాయి.

news18-telugu
Updated: July 14, 2019, 3:28 PM IST
Chandrayaan 2 | చంద్రయాన్ 2 పై విదేశీ మీడియా అభినందనలు, సెటైర్లు, అక్కసు..
చంద్రయాన్ 2 (Image:ISRO/Twitter)
  • Share this:
చంద్రయాన్ 2. భారత్‌తో పాటు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. పాశ్చాత్యదేశాల మీడియాతో పాటు, అక్కడి సైంటిఫిక్ జర్నల్స్ దీనిపై ప్రత్యేక కథనాలను ప్రచురిస్తున్నాయి. అయితే, అందులో చాలా మంది చంద్రయాన్ 2 బడ్జెట్.. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘అవేంజర్స్ ఎండ్ గేమ్’ కంటే కూడా తక్కువ అన్న పాయింట్‌ను హైలైట్ చేస్తున్నాయి. అపోలో 2 చంద్రుడి మీద అడుగుపెట్టిన 50 ఏళ్లకు చంద్రయాన్ 2 మిషన్ నింగిలోకి దూసుకెళ్తోంది. ఈనెల 15న తెల్లవారుజామున 2.51 నిమిషాలకు చంద్రయాన్ 2 లాంచ్ అవుతుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగిస్తున్నారు.

‘చంద్రయాన్ 2 మొత్తం ఖర్చు 124 మిలియన్ అమెరికన్ డాలర్లు. (సుమారు రూ.850 కోట్లు). అందులో 93 మిలియన్ డాలర్లు శాటిలైట్ కోసం, 31 మిలియన్ డాలర్లు ఇతరత్రా ప్రోగ్రామ్ లాంచ్ కోసం. అయితే, దీని మొత్తం ఖర్చు చూసినా.. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అవేంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా బడ్జెట్ (సుమారు రూ.2,440 కోట్లు) కంటే తక్కువ.’అని స్పుత్నిక్ మేగజీన్ కథనాన్ని రాసింది.

‘అందరూ చంద్రుడి మీదకు వెళ్లాలనుకుంటున్నారు. కానీ ఎందుకు? చందమామ మీద అపోలో మిషన్ అడుగుపెట్టి ఏళ్లు అయిన తర్వాత కూడా అందరూ అదే దారిలో ఎందుకు వెళ్తున్నారు? ఈ స్పేస్ రేస్ వెనుక ఉన్న కారణం ఏంటి?’ అని ద గార్డియన్ పత్రిక కథనాన్ని రాసింది.

న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే తరహాలో స్టోరీని ప్రచురించింది. ‘అందరూ చంద్రుడి వెనకే ఎందుకు పడుతున్నారు?.’ అనే హెడ్ లైన్‌తో భారత్ మీద ఓ రకమైన చులకన భావంతో కూడిన స్టోరీని రాసింది. ‘చంద్రుడి మీద దిగడం అంటే భారత్‌.. తాము సాంకేతికంగా ముందున్నామని హైలైట్ చేసుకోవడానికి పనికొస్తుంది. అంతరిక్షంలో తాము వరల్డ్ పవర్ అని చైనా డబ్బాకొట్టుకుంటుంది. అదే అమెరికా, నాసా విషయానికి వస్తే.. చంద్రుడు అనేది మార్స్‌కు వెళ్లడానికి మార్గమధ్యంలో ఓ స్టాప్ లాంటిది.’ అని అభిప్రాయపడింది.



అంతరిక్ష పరిశోధనలో భారతీయుల కలలను ప్రతిబింబించేలా చంద్రయాన్ 2 కనిపిస్తోందని వాషింగ్టన్ పోస్ట్ ఆర్టికల్‌ను ప్రచురించింది. ‘1960ల్లోనే భారత్ అంతరిక్ష పరిశోధనా రంగంలోకి అడుగులు వేసినా.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నవోత్తేజంతో దూసుకెళ్తోంది. అంతరిక్ష పరిశోధనా విభాగానికి మోదీ కొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించారు. అంతర్జాతీయంగా తమ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పారు.’ అని కథనాన్ని ప్రచురించింది. అదే సమయంలో భారత్ చేపట్టిన మొట్టమొదటి మార్స్ మిషన్‌కు అయ్యే ఖర్చు ‘గ్రావిటీ’ అనే ఇంగ్లీష్ సినిమా బడ్జెట్కంటే కూడా తక్కువ అని రాసింది.
First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...