Chandrayaan 2: ధైర్యంగా ఉండండి.. ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ

జీవితంలో ఒడిదుడుకులు సహజమని.. శాస్త్రవేత్తల కృషితో దేశం మరోసారి సంబరాలు చేసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు.

news18-telugu
Updated: September 7, 2019, 2:52 AM IST
Chandrayaan 2: ధైర్యంగా ఉండండి.. ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ
జీవితంలో ఒడిదుడుకులు సహజమని.. శాస్త్రవేత్తల కృషితో దేశం మరోసారి సంబరాలు చేసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు.
news18-telugu
Updated: September 7, 2019, 2:52 AM IST
Chandrayaan 2: విక్రమ్ ల్యాండింగ్‌లో సమస్య తలెత్తడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి గురయ్యారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలోకి వచ్చిన తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ కోల్పోయినట్లు ఛైర్మన్ శివన్ ప్రకటించడంతో అందరి కళ్లలో బాధ కనిపించింది. దాంతో అక్కడే ఉన్న ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. జీవితంలో ఒడిదుడుకులు సహజమని.. శాస్త్రవేత్తల కృషితో దేశం మరోసారి సంబరాలు చేసుకుంటుందని ఆయన అన్నారు.

జీవితంలో జయాపజయాలు సహజం. ధైర్యంగా ఉండండి.ఇప్పటివరకు సాధించిన విజయం చిన్నది కాదు. శాస్త్రవేత్తల కృషిని చూసి దేశం గర్విస్తోంది. మీరు దేశానికి, మానవజాతికి, సైన్స్‌కి ఎంతో సేవ చేశారు. భవిష్యత్‌పై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుదాం. నేను మీకు అండగా ఉంటాను. దేశం మొత్తం మీ వెంటే ఉంటుంది.
ప్రధాని మోదీ
అన్ని అవరోధాలను దాటుకుంటూ ముందుకెళ్లిన విక్రమ్ ల్యాండర్‌కి ఆఖరి క్షణాల్లో అవరోధం ఏర్పడింది. చంద్రునికి అతి సమీపంలోకి వెళ్లిన తర్వాత ల్యాండర్ నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ కట్ అయింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. దూరంలో ఉన్న సమయంలో ఈ అంతరాయం కలిగిందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...