చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక ఘట్టం విజయవంతం.. కొత్త చరిత్రకు కొద్ది దూరంలోనే..

Chandrayaan-2: ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్‌కు చెందిన తొలి కక్ష్యను విజయవంతంగా తగ్గించినట్లు భారత పరిశోధనా సంస్థ ప్రకటించింది. ల్యాండర్‌ను అత్యంత సున్నితంగా చంద్రుడిపై కక్ష్యలోకి దింపే ముందు ఈ కక్ష్యను తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 3, 2019, 12:54 PM IST
చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక ఘట్టం విజయవంతం.. కొత్త చరిత్రకు కొద్ది దూరంలోనే..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 3, 2019, 12:54 PM IST
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 లో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్‌కు చెందిన తొలి కక్ష్యను విజయవంతంగా తగ్గించినట్లు భారత పరిశోధనా సంస్థ ప్రకటించింది. ల్యాండర్‌ను అత్యంత సున్నితంగా చంద్రుడిపై కక్ష్యలోకి దింపే ముందు ఈ కక్ష్యను తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు ఉదయం 8:50 గంటలకు చంద్రుని కక్ష చుట్టూ తిరుగుతున్న దూరాన్ని ఆర్బిటర్ తగ్గించుకుందని, నాలుగు సెకన్ల పాటు ప్రొపల్షన్ వ్యవస్థను ఆన్ చేయడం ద్వారా కక్ష్యను తగ్గించినట్టు వివరించారు. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ 104/128 కిలోమీటర్ల దూరంలో చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తోందని, తదుపరి డీ-ఆర్బిటింగ్‌ను రేపు తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల మధ్య చేపడతామని తెలిపారు.

ఈ నెల 7న 1:50 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ దిగనుందని వెల్లడించారు. కొద్ది రోజులు భూకక్ష్యలో తిరిగిన చంద్రయాన్-2 ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలో చేరింది. ఆ తర్వాత కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇస్రో ఆరు సార్లు సమర్థవంతంగా చేపట్టింది. ఇదిలా ఉండగా, ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ల్యాండర్‌కు విక్రమ్ అని పేరు పెట్టారు. ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చే రోవర్‌కు ప్రజ్ఞాన్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.


First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...