Chandrayaan 2 ప్రయోగం ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? ఇక్కడ నమోదు చేసుకోండి..

Chandrayaan 2 | ఈనెల 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట నుంచి నింగికి ఎగరనుంది.

news18-telugu
Updated: July 19, 2019, 5:00 PM IST
Chandrayaan 2 ప్రయోగం ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? ఇక్కడ నమోదు చేసుకోండి..
చంద్రయాన్ 2 ప్రయోగం (Image:ISRO)
news18-telugu
Updated: July 19, 2019, 5:00 PM IST
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం ఈనెల 22న జరగనుంది. మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్ 2 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈనెల 15న తెల్లవారుఝామున 2.51 నిమిషాలకు చంద్రయాన్ 2 ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే, సాంకేతిక కారణాలతో 56 నిమిషాల ముందు కౌంట్‌డౌన్ వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి ప్రయోగతేదీని ఖరారు చేసింది ఇస్రో. ఈనెల 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట నుంచి నింగికి ఎగరనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారికి.. ఇస్రో అవకాశం కల్పిస్తోంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది.





జీఎస్‌ఎల్వీ మార్క్ 3 వాహకనౌక ద్వారా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. సెప్టెంబర్ 12 లేదా 13 తేదీ నాటికి ఈ ఉపగ్రహం చంద్రుడిపై అడుగు పెడుతుంది. అక్కడ 14 రోజుల పాటు సేవలు అందిస్తుంది. చంద్రయాన్ 2లో ప్రధానంగా ల్యాండర్, రోవర్ అని రెండు విభాగాలు ఉంటాయి. చంద్రయాన్ 2 కోసం ఇస్రో సుమారు రూ.950 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.
Loading...



రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
First published: July 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...