ఈ రెండు సెక్స్ టాయ్స్‌కి అవార్డులు వచ్చాయి

గతేడాది ఏ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో-CES అవార్డును వెనక్కి తీసుకుందో... ఇప్పుడు అదే షోలో సీఈఎస్ హానరీ ఇన్నోవేషన్ అవార్డు ప్రకటించడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఈసారి సరికొత్త పాలసీని ప్రకటించారు షో నిర్వాహకులు.

news18-telugu
Updated: January 6, 2020, 5:11 PM IST
ఈ రెండు సెక్స్ టాయ్స్‌కి అవార్డులు వచ్చాయి
ఈ రెండు సెక్స్ టాయ్స్‌కి అవార్డులు వచ్చాయి (Images: Lora DiCarlo)
  • Share this:
ఓ సెక్స్ టాయ్... గతేడాది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో కలకలం రేపింది. వివాదానికి కారణమైంది. సెక్స్ టెక్ స్టార్టప్ లోరా డికార్లో తయారుచేసిన సెక్స్ టాయ్ అది. అప్పట్లో ఆ వ్యవహారం పెద్ద రచ్చరచ్చైంది. ఇదంతా జరిగి ఏడాదైంది. ఇప్పుడు అదే సెక్స్ టెక్ స్టార్టప్ లోకా డికార్లో మరో రెండు సెక్స్ టాయ్స్ తయారుచేసి ప్రదర్శనకు తీసుకొచ్చింది. అంతేకాదు... Baci, Onda పేరుతో రూపొందించిన ఆ రెండు సెక్స్ టాయ్స్‌కి అవార్డులు రావడం మరో విశేషం. గతేడాది ఏ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో-CES అవార్డును వెనక్కి తీసుకుందో... ఇప్పుడు అదే షోలో సీఈఎస్ హానరీ ఇన్నోవేషన్ అవార్డు ప్రకటించడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఈసారి సరికొత్త పాలసీని ప్రకటించారు షో నిర్వాహకులు. "ఇది టెక్నాలజీకి, ఆర్గాజంకు సంబంధించిన అంశం కాదని, ఆరోగ్యం, నిద్ర, ఒత్తిడిలేమి లాంటివాటికోసం టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది అన్న కోణంలో చూడాలి" అని లోరా డికార్లో ఫౌండర్ లోరా హడ్డాక్ తెలిపారు.

గతేడాది స్టార్టప్ లోరా డికార్లో మహిళల కోసం తయారు చేసిన మొదటి సెక్స్ టాయ్ Osé పెను దుమారాన్నే రేపింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో నిర్వాహకులైన కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ మొదట ఇన్నోవేషన్ అవార్డు ప్రకటించడం, వివాదం కావడంతో అవార్డు వెనక్కి తీసుకోవడం, మళ్లీ అవార్డు ఇవ్వడం లాంటి వార్తలు హాట్ టాపిక్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి:

TSPSC Jobs: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంSBI Jobs: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Pension Scheme: నెలకు రూ.10,000 పెన్షన్ వచ్చే ఈ స్కీమ్ గురించి తెలుసా?
First published: January 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు