మరో మూడు రోజుల్లో దీపావళి సెలబ్రేట్ (Diwali Celebrations) చేసుకోవడానికి దేశమంతా సిద్ధమవుతోంది. భారతదేశంలో అతిపెద్ద పండుగల్లో దీపావళి కూడా ఒకటి. కంపెనీలు తమ ఉద్యోగులకు దీపావళి బహుమతుల్ని (Diwali Gifts) ఇస్తుంటాయి. బోనస్‌లు కూడా ప్రకటిస్తాయి. బ్యాంకులు, వ్యాపారులు ఆఫర్స్ కూడా అందిస్తూ ఉంటాయి. ఈ గిఫ్టింగ్ సీజన్లో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు దీపావళి బహుమతుల పేరుతో మోసాలు మొదలయ్యాయి. ఉచితంగా దీపావళి బహుమతులు పొందాలంటూ వస్తున్న మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరిస్తోంది.
వాట్సప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో దీపావళి గిఫ్ట్స్ పేరుతో మెసేజెస్ సర్క్యులేట్ అవుతున్నాయని, ఫెస్టివల్ ఆఫర్స్, గిఫ్ట్స్, బహుమతుల పేరుతో లింక్స్ పంపిస్తున్నారని, ఆ లింక్స్ క్లిక్ చేస్తే చైనాకు చెందిన వెబ్సైట్లకు లింక్ అయ్యే అవకాశం ఉందని, .cn, .xyz, .top డొమైన్లతో ఈ వెబ్‌సైట్స్ ఉన్నాయని CERT-In గుర్తించింది. ఈ మెసేజెస్ క్లిక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. యూజర్ల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తోంది.
JioBook: స్మార్ట్‌ఫోన్ ధరకే జియోబుక్ రిలీజ్... అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చిన ల్యాప్‌టాప్
దీపావళి బహుమతుల పేరుతో వాట్సప్ , ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యూజర్లకు మెసేజెస్ వస్తాయి. దీపావళి సందర్భంగా గిఫ్ట్స్ ఇస్తామని, వెంటనే మీ బహుమతులు క్లెయిమ్ చేసుకోండని మెసేజ్‌లో ఉంటుంది. ఆ మెసేజ్‌లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే ఆ తర్వాత "Congratulations" అని మెసేజ్ కూడా వస్తుంది. ఈ మెసేజ్ చూసి నిజంగానే తమకు బహుమతి వచ్చిందని నమ్మేస్తారు.
ఆ తర్వాత వెబ్సైట్లో ఉన్న ఫామ్‌లో వివరాలు పూర్తి చేయాలని సైబర్ నేరగాళ్లు అడుగుతారు. ఫామ్ పూర్తి చేస్తే తమకు గిఫ్ట్ వస్తుందని నమ్మితే మోసపోయినట్టు. ఫామ్ పూర్తి చేసిన తర్వాత మళ్లీ "Congratulations" మెసేజ్ వస్తుంది. అంతేకాదు ఈ మెసేజ్ మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయాలని కండీషన్ కూడా ఉంటుంది. షేర్ చేసిన తర్వాత ప్రైజ్ క్లెయిమ్ చేసుకోవచ్చని నమ్మిస్తారు. కానీ ఇదంతా పెద్ద మోసం.
55 inch Smart TV: అదిరిపోయే ఆఫర్... రూ.30 వేల లోపే 55 అంగుళాల 4K స్మార్ట్ టీవీ... 3 రోజులే ఛాన్స్
ఈ మోసాలకు గురికాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండటం అవసరం. మీ వాట్సప్, టెలిగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా యాప్‌లో వచ్చే వచ్చే మెసేజెస్ నమ్మకూడదు. ఎట్టిపరిస్థితుల్లో ఆ లింక్స్ క్లిక్ చేయకూడదు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ నెంబర్స్ ఎక్కడా షేర్ చేయకూడదు. ఎవరికీ చెప్పకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, Cyber security, Social Media, Telegram, Whatsapp