#TelanganaElections2018: మీ ఓటు ఎక్కడుందో ఇలా తెలుసుకోండి...

Telangana Elections 2018 | ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు(ఈపీఐసీ) నెంబర్‌ను పేరుతో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఈపీఐసీ నెంబర్‌తో సెర్చ్ చేసి ఓటర్ పేరు, పోలింగ్ స్టేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాదు... పోలింగ్ స్టేషన్‌కు వెళ్లడానికి సులువైన మార్గాన్ని గుర్తించొచ్చు. దగ్గర్లోని బస్టాప్, రైల్వేస్టేషన్ ఏదో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఓటర్ వికలాంగులైతే పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లడానికి సాయాన్ని కోరొచ్చు.

Santhosh Kumar S | news18-telugu
Updated: December 5, 2018, 5:07 PM IST
#TelanganaElections2018: మీ ఓటు ఎక్కడుందో ఇలా తెలుసుకోండి...
'నా ఓటు' యాప్ రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం Screenshot: Playstore
  • Share this:
తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం మరో యాప్‌ను పౌరుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. 'నా ఓటు' పేరుతో రిలీజ్ చేసిన యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు ఉపయోగపడేలా ఈ యాప్ రూపొందించడం విశేషం. ఇందులో ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు(ఈపీఐసీ) నెంబర్‌ను పేరుతో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఈపీఐసీ నెంబర్‌తో సెర్చ్ చేసి ఓటర్ పేరు, పోలింగ్ స్టేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాదు... పోలింగ్ స్టేషన్‌కు వెళ్లడానికి సులువైన మార్గాన్ని గుర్తించొచ్చు. దగ్గర్లోని బస్టాప్, రైల్వేస్టేషన్ ఏదో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఓటర్ వికలాంగులైతే పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లడానికి సాయాన్ని కోరొచ్చు. అసెంబ్లీ నియోజకవర్గాలు, అభ్యర్థుల వివరాలూ ఈ యాప్‌లో ఉంటాయి. యాప్ ఎలా వాడాలో వీడియో చూసి తెలుసుకోండి.


ఈ కొత్త యాప్ డిజైన్ కాంటెస్ట్‌ని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ప్రారంభించారు. ఈ పోటీలో ఎవరైనా పాల్గొనొచ్చు. రాజ్యాంగ సంస్థ అయిన భారత ఎన్నికల సంఘాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సంస్కృతి ప్రతిబింబేలా లోగో రూపొందించాలని కోరుతున్నారు. సులువుగా అర్థం చేసుకునేలా ఉండే ఈ లోగోలో 'నా ఓటు' అనే పదాలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఉండాలి. విజేతలకు రూ.15,000 బహుమతి లభిస్తుంది. నవంబర్ 30న ప్రారంభమయ్యే కాంటెస్ట్ డిసెంబర్ 6 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. విజేతలను డిసెంబర్ 10న ప్రకటిస్తారు. దరఖాస్తుల్ని naavotets@gmail.com మెయిల్ ఐడీకి పంపాలి. దరఖాస్తులో ఫోన్‌లో ఓపెన్ చేసిన యాప్ స్క్రీన్ షాట్, దరఖాస్తుదారుడి పేరు, వయస్సు, జెండర్, ఫోన్ నెంబర్, అడ్రస్ తప్పనిసరిగా ఉండాలి.

ఇవి కూడా చదవండి:

వాట్సప్‌లో వెంటనే మార్చాల్సిన సెట్టింగ్స్ ఇవే...

రియల్‌మీ యూ1 లుక్ ఎలా ఉందో చూశారా?

హానర్ 8సీ రిలీజ్... ధర రూ.11,999కత్తిలాంటి లగ్జరీ కార్లు అంటే ఇవే...

పాత రూ.500 నోట్లకు డిమాండ్... ఎక్కడో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: December 5, 2018, 5:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading