హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp, Telegram, Zoom, Google Meet వాడొద్దు.. మోదీ సర్కార్ సంచలన ఆదేశాలు

WhatsApp, Telegram, Zoom, Google Meet వాడొద్దు.. మోదీ సర్కార్ సంచలన ఆదేశాలు

మోదీ (ఫైల్ ఫొటో)

మోదీ (ఫైల్ ఫొటో)

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సమాచార మార్పిడికి, ముఖ్యమైన ధ్రువపత్రాలను పంపించడానికి వాట్సాప్(Whatsapp), టెలిగ్రామ్(Telegram) లాంటి వాడొద్దని స్పష్టం చేసింది. ఇంకా జూమ్(Zoom), గూగుల్ మీట్(Google Meet) కూడా వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఇంకా చదవండి ...

కేంద్ర ప్రభుత్వం (Central Government) ఉద్యోగులకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమైన పత్రాలను పంపించడానికి వాట్సాప్(WhatsApp), టెలిగ్రామ్(Telegram) తదితర యాప్ లను ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. ఈ మాధ్యమాల ద్వారా డాక్యుమెంట్లను పంపిస్తే అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఉద్యోగులను హెచ్చరించింది కేంద్రం. ఈ యాప్ లకు సంబంధించిన సర్వర్లు విదేశాల్లో ఉంటాయి. అయితే ముఖ్యమైన సమాచారాన్ని ఈ యాప్ ల ద్వారా పంపిస్తే హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేసే ఉద్యోగులంతా ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది. వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న వారంతా సమాచార మార్పిడి కోసం కేవలం e- office applications మాత్రమే వాడాలని కేంద్రం స్పష్టం చేసింది.

వర్చువల్ మీటింగ్స్ కు సంబంధించి సైతం కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారులు వర్చువల్ మీటింగ్స్ కోసం Google Meet, Zoom లాంటి ప్రైవేట్ యాప్స్ ను అస్సలు వినియోగించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(NIS) డెవలప్ చేసిన వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్స్ మాత్రమే వినియోగించాలని సూచించింది. వీటిని వినియోగిస్తున్నప్పుడు పాస్వర్డ్స్ ను తప్పనిసరిగా వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ ల వినియోగంపై కూడా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

Smartphone Hack: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. హ్యాకింగ్ గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

దేశ భద్రకు సంబంధించి నిర్వహించే కీలక సమావేశాలకు హాజరయ్యే సమయంలో అధికారులు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లను వెంట తీసుకురావొద్దని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రహస్య సమాచారం లీక్ కావడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. జాతీయ కమ్యూనికేషన్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను ఈ యాప్స్ నిరంతరం ఉల్లంఘించుతుండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రూపొందించిన ఆదేశాలను కేంద్రం విడుదల చేసింది. ఈ ఆదేశాలను అన్నీ మంత్రిత్వ శాఖల అధికారులు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Google Meet, Narendra modi, Telegram, Whatsapp

ఉత్తమ కథలు